Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ

District SP : పగలు, రాత్రి 24/7 పెట్రొలింగ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం..!

District SP : పగలు, రాత్రి 24/7 పెట్రొలింగ్.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం..!

దేవరకొండ, మనసాక్షి :

పగలు. రాత్రి 24/7 పెట్రోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లా గురువారం దేవరకొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పోలీసు స్టేషన్ పరిధిలోని స్థితిగతులు గురించి అడిగి తెలుసుకున్నారు.

పలు రికార్డులు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందిస్తూ, భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.

దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి పెట్రొలింగ్ నిర్వహించాలని, సి.సి కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వహులకు అవగాహన పెంచాలని, రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు.

అక్రమ గంజాయి రవాణా జరగకుండా అను నిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పగలు, రాత్రి 24/7 పెట్రొలింగ్ మరియు బీట్లు నిర్వహించాలని పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిoచి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని, సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే తగు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలగజేసేల పని చేయాలని,అప్పుడే ప్రజలలో పోలీస్ శాఖ పైన నమ్మకం కలుగుతుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ డి.యస్.పి గిరిబాబు, సిఐ నరసింహులు యస్.ఐ.లు అజ్మీర రమేష్, విల్సన్, మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

LATEST UPDATE : 

NALGONDA : రుణమాఫీలో కాలయాపన చేస్తే రైతులు తగిన బుద్ధి చెబుతారు.. నల్గొండ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా..! 

Mlc Kavitha : ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత.. 10 రోజులపాటు అక్కడే..!

Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!

Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!

Rythu Barosa, Runmafi : రైతు భరోసా, పంటల రుణమాఫీ యాప్ తో సమస్యలకు చెక్.. రేపటి నుంచి ఇంటింటికి సర్వే..!

మరిన్ని వార్తలు