WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక లవర్స్ సేఫ్..!
WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇక లవర్స్ సేఫ్..!
మన సాక్షి , వెబ్ డెస్క్:
వాట్సప్ వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉన్నారు. మెసేజింగ్ యాప్ లో అత్యధిక మంది వినియోగించేది వాట్సప్. దీనిలో కొత్త కొత్త ఫీచర్స్ ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. వాట్స్అప్ వినియోగించని వారంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి ఫోన్లో వాట్స్అప్ ఉంటుంది. వాయిస్ కాల్స్, మెసేజ్ లు, స్టేటస్ లు ఇలా ప్రతి ఒక్క దానికి కూడా వాట్సాప్ ని వినియోగిస్తున్నారు.
వాట్సప్ యాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. వాట్స్అప్ స్టేటస్, వాట్స్అప్ ఛానల్, ఏఐ ఫీచర్, రిప్లై బార్ ఫీచర్, ఆల్బమ్ పిక్చర్స్, ఏ ఆర్ ఫీచర్స్ ఇలా ఎన్నో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు సరి కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అది లవర్స్ కు చాలా సేఫ్ గా ఉండే ఫీచర్.. ఆన్‌లైన్ స్టేటస్ హైడింగ్ ఫీచర్.. దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటో వివరాలు తెలుసుకుందాం..
ఆన్ లైన్ లో ఉన్నప్పుడు వాట్సప్ కు చివరిసారిగా ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు ఆన్ లైన్ లో ఉంటున్నారు అనే విషయం అవతలివారికి ఈజీగా తెలిసిపోతుంది. దీనివల్ల ఆన్ లైన్లో ఉన్నా మెసేజ్ లు చూడటం లేదు, రిప్లై ఇవ్వడం లేదు, అనే విషయాలతో పాటు లేట్ నైట్ వరకు వాట్సప్ లో ఉంటున్నారు అని రకరకాలుగా చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ అనుకుంటున్నార ముఖ్యంగా లవర్స్ విషయానికొస్తే ఈ సమస్యతో పెద్ద గొడవలే జరిగిపోతున్నాయి. ఇలాంటి పెద్ద సమస్యకు వాట్సప్ చెక్ పెట్టింది.
ఆన్‌లైన్ స్టేటస్ షోయింగ్ అనేది పెద్ద సమస్యగా వచ్చింది. ఈ సమస్యకు చెక్ పెట్టింది. అయితే ఇప్పటివరకు ఈ హైడింగ్ ఫీచర్ అనేది వాట్సాప్ స్టేటస్ లకు లాస్ట్ సీన్స్ కు మాత్రమే ఉండేది. కానీ ఎప్పుడు మాత్రం ఆన్ లైన్ కు వస్తున్నారు. అసలు ఆన్ లైన్ లో ఉన్నారా.? లేదా.? అనే విషయాలకు చెక్ పెట్టేలా ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త ఫీచర్ వల్ల వాట్స్అప్ యూజర్స్ తమ ప్రైవసీని భద్రపరచడానికి వారి ఆన్‌లైన్ స్టేటస్ లను ఇతరులకు కనిపించకుండా దాచడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ను మీ ఫోన్లో ఎలా సెట్టింగ్స్ మార్చుకోవాలో తెలుసుకుందాం.
మీ ఫోన్లోని వాట్సప్ యాప్ లో మీరు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం మీ ఆన్లైన్ స్టేటస్ ఉంటుంది. ఉదాహరణకు Nobody అనే ఆప్షన్ ఎంచుకుంటే మీ ఆన్లైన్ స్టేటస్ ఎవరికి కనిపించదు. దాంతో పాటు యూజర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కంపెనీ యాప్, వెబ్‌సైట్ రెండింటికి సెక్యూరిటీ ప్రైవసీ ఫీచర్లను పరిచయం చేసింది.
ఇకనుంచి వాట్సప్ వినియోగదారులు వారి స్టేటస్ ను ఇతరులకు కనిపించకుండా దాచ వచ్చును. అలాగే ఆన్‌లైన్ స్టేటస్ లు కూడా ప్రైవేటు లో ఉండే ఫీచర్లను బట్టి దాచుకోవచ్చును. అలాగే చాట్ చేయవచ్చును. ఇక ఎంపిక చేసిన కాంటాక్టు, ఫ్రెండ్స్ కు మాత్రమే మీ ఆన్లైన్ స్టేటస్ కనిపించేలా చేసుకోవచ్చును.
ఇవి కూడా చదవండి :
BREAKING : కంటైనర్ లో 800 కేజీల గంజాయి తరలింపు..!
Milk packets : మీరు ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!
Banana : అరటిపండు తినడం వల్ల ఆ.. ప్రయోజనాలు కూడా ఉంటాయి.. అవేంటో తెలుసుకుందాం..!
BIG BREAKING : శ్రీశైలంకు గంట గంటకు పెరుగుతున్న వరద.. ఈరోజే ఎత్తనున్న 4 గేట్లు..!










