Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Jobs : ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఉద్యోగాలు మంజూరు..!

Jobs : ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఉద్యోగాలు మంజూరు..!

తుంగతుర్తి, మన సాక్షి:

తుంగతుర్తి మండలం లోని వంద పడకల ఆసుపత్రికి ఈ మధ్య కాలంలోనే నూతన భవనం నిర్మించుటకు 40 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేయడం కోసం నూతన ప్రభుత్వం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ పలువురు జిల్లా మంత్రుల సహకారంతో ఈ హాస్పిటల్ 100 పడకల కాంట్రాక్టును నూతన భవనం కోసం భూమి పూజ చేసి ఎనిమిది నెలలు కావస్తుంది. నాలుగు అంతస్తులు స్లాబు వేసి 20 కోట్లకు పైగా పనులు చేసి బిల్లులు రాకపోవడంతో నిలిపివేశాడు.

ఈ మధ్యకాలంలో తుంగతుర్తి నియోజకవర్గం కు ఈ హాస్పిటల్ కు వైద్య సిబ్బందికి రోగులకు సరిపోను త్రాగునీటి కోసం వాటర్ ప్లాంట్ ను నూతనంగా నిర్మించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు మందుల సామిల్ రాగా వారికి హాస్పిటల్ గురించి పనులు ఆగిన విషయాలను తెలియపరిచారు.

హాస్పిటల్ ఇన్చార్జి డాక్టర్ నిర్మల్ కుమార్ ఈ హాస్పిటల్కు నూతన జనరేటర్ 20 లక్షలతో సాంక్షన్ చేయాలని లెటర్ కూడా ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇన్చార్జి డాక్టర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ వంద పడకల హాస్పిటల్ కు 27 మంది వైద్య విధాన పరిషత్ నుండి నూతన జాబులను నియమించడం జరిగింది. నియోజకవర్గ కేంద్రంలోని ఏది ఆసుపత్రికి వివిధ కేటగిరీలకు సంబంధించిన 27 పోస్టులు మంజూరయ్యాయి.

ఈ మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది సివిల్ సర్జన్ స్పెషలిస్టు కేటగిరిలో అస్తమాలజీ పల్మనరి మెడిసిన్ రేడియాలజీ జనరల్ సర్జన్ పీడియాట్రిక్స్ గైనకాలజీ ఆర్ఎంఓ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ కేటగిరిలో అనస్త్య పలు ఆరోగ్యాల డాక్టర్లను నియమించడం జరిగిందన్నారు. కావున ఈ హాస్పిటల్కు కొన్ని నిధులను మంజూరు చేసినట్లయితే 10 కోట్ల నుండి 20 కోట్లు సాంక్షన్ చేస్తే కాంట్రాక్టర్ మొదలు పెడతామన్నారు.

ఇంకా ఒక ఆరు ఏడు నెలల ఈ హాస్పిటల్ పూర్తిగా పనులు చేసినట్లయితే తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ప్రతి డాక్టర్లు స్పెషలిస్టులు ఆపరేషన్లు అన్నిటికీ వసతులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలియపరిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది హెడ్ నర్సుల పాల్గొన్నారు.

MOST READ : 

  1. Good News : ఏకలవ్య మోడల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..!

  2. Suspended : జిల్లా విద్యాధికారి సంచలన నిర్ణయం.. ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్..! 

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం..!

మరిన్ని వార్తలు