Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!

Pass Book : రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు.. ప్రతి యజమానికి భూధార్ నెంబర్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో భూ యజమానులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రానున్నాయి. దాంతోపాటు ప్రతి యజమానికి కూడా ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్ కూడా ప్రభుత్వం కేటాయించనున్నది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో భూ భారతి బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లు గవర్నర్ విష్ణు దేవ్ వర్మ దగ్గరకు చేరింది. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి పోర్టల్ వస్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రానున్నాయి.
ధరణి వ్యవస్థలో కేవలం సింగిల్ కాలం ఫార్మాట్ తో పోలిస్తే కొత్తగా వచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూమి యాజమాన్యం వివరణాత్మక చరిత్రతో 11 వరుసగా ఉండే తాజా పట్టాదార్ పాస్ పుస్తకం జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి యజమానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. ఆధార్ నెంబర్ మాదిరిగానే భూదార్ నెంబర్ జారీ చేయనున్నారు. ప్రారంభంలో తాత్కాలిక భూధార్ జారీ చేయబడుతుంది. ఇది భూభాగాల యొక్క జియో రిఫరెన్స్ ఇంకా పెండింగ్ లో ఉందని సూచిస్తుంది.
ఆ తర్వాత వ్యవసాయ రికార్డుల్లో ఏమైనా వ్యత్యాసాలకు పరిష్కరించడానికి క్షేత్రస్థాయి సర్వే అనుసరించబడుతుంది. ఇదంతా పూర్తయిన తర్వాత భూ యజమానులు శాశ్వత భూదార్ నెంబర్ కలిగి ఉంటారు. ఇది జియో రిఫరెన్స్ డేటాను నిర్ధారిస్తుంది.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!
-
UPI : గూగుల్ పే ఫోన్ పే వాడుతున్నారా.. అయితే జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!
-
Gurukula : గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు..!









