Mee seva : మరో తొమ్మిది రకాల మీ సేవలు..!

Mee seva : మరో తొమ్మిది రకాల మీ సేవలు..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో మీ సేవల ద్వారా మరో తొమ్మిది రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే అనేక రకాల సేవలు మీ సేవ ద్వారా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా మరో తొమ్మిది రకాల సేవలను అందించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్ణయించారు.
తహసిల్దార్లు ప్రస్తుతం నేరుగా జారీ చేస్తున్న ధ్రువపత్రాలను ప్రజలు ఆన్ లైన్ లో మీ సేవ కేంద్రాల ద్వారా పొందేలా చర్యలు చేపట్టారు. తొమ్మిది రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు మీసేవ ఆన్ బోర్డులో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం ఆదేశించింది.
9 రకాల పత్రాలు ఇవే :
+ పౌరుల పేరు మార్పిడి.
+ ఆదాయ, కుల, తదితర ధ్రువీకరణ పత్రాలు.
+ స్థానికత నిర్ధారణ.
+ స్టడీ గ్యాప్ సర్టిఫికెట్.
+ మైనారిటీ ధ్రువీకరణ పత్రం.
+ క్రీమీలేయర్, నాన్ క్రిమిలేయర్ పత్రం.
+ మార్కెట్ విలువ పత్రం
+ భూములకు సంబంధించిన ఖాస్త్ర, పహనీ పాత ధ్రువీకరణ పత్రాలు
+ ఆర్ ఓ ఆర్ -1( బి) సర్టిఫైడ్ పత్రాలు.
LATEST UPDATE :
Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!
Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!
Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!









