బిజెపి నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్.. ప్రధాని మోడీ ఘన సత్కారం..!
భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనంగా సత్కరించారు.

బిజెపి నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్.. ప్రధాని మోడీ ఘన సత్కారం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనంగా సత్కరించారు. సోమవారం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ అనంతరం నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ప్రస్తుతం ఆయన బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో పండగ వాతావరణం తలపించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ తదితర అగ్రనేతలు నూతన అధ్యక్షుడిని అభినందించారు.
జాతీయ ఎన్నికల అధికారి కె లక్ష్మణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక నిబంధనల ప్రకారం సాగిందని తెలిపారు. 36 రాష్ట్ర యూనిట్లలో 30 మంది రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన తర్వాతనే జాతీయ అధ్యక్షుడు ఎన్నిక మొదలైనట్లు తెలిపారు.
నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు అయ్యాయని అగ్రనేతలు ఆయన పేరును ప్రతిపాదించడం విశేషం అని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో నితిన్ నబీన్ తప్ప మరెవరు పోటీలో లేకపోవడం వల్ల ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు.
MOST READ NEWS
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!
-
Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కీలక పరిణామం.. స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు..!
-
Medaram : సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి..!









