TOP STORIESBreaking News

TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఇతరులకు ప్రతినెల ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారికి అతి బారీ గుడ్ న్యూస్ తెలియజేసింది.

గత ఐదు సంవత్సరాల కాలంలో 2.24 లక్షల మంది పెన్షన్ దారులు సొంత గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లినట్లుగా గుర్తించింది. అయితే వారు మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ జాబితా నుంచి పేర్లను తొలగించారు. అయితే వారు సొంత ఊరికి వెళ్లి ఉన్నవారికి మళ్ళీ పెన్షన్ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వలస వెళ్లి సొంత గ్రామానికి చేరుకున్న వారికి ప్రభుత్వ నిర్ణయం భారీ ఊరట కలిగించింది.

పెన్షన్ కోసం అనేక పాట్లుపడుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే అధికారులు కూడా ప్రభుత్వ నిర్ణయం మేరకు మూడు నెలలపాటు పెన్షన్ తీసుకుని వారి జాబితా నుంచి తొలగించడం వల్ల ఏమి చేయలేని పరిస్థితి నెలకొన్నది. కాగా అలాంటి వారికి ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం వారికి మే 1వ తేదీ నుంచి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు రూ.4016, ఇతర పెన్షన్ దారులకు రూ. 2016ల రూపాయలు పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోని వారికి పెన్షన్ తొలగుంచడం వల్ల అలాంటి వారికి మే ఒకటో తేదీ నుంచి మళ్లీ వారికి పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తిరిగి మళ్లీ వారు దరఖాస్తు చేసుకుంటే పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది.

MOST READ :

  1. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!

  2. Food Safety Officers : ఫుడ్ సేఫ్టీ అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు.. బేకరీ తనిఖీ చేసిన అధికారులు..!

  3. TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

  4. Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!

  5. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

మరిన్ని వార్తలు