తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Award : సాహితీ వేత్త పెద్దిరెడ్డి గణేష్ కు ఎన్టీఆర్ స్మారక అవార్డ్..!
Award : సాహితీ వేత్త పెద్దిరెడ్డి గణేష్ కు ఎన్టీఆర్ స్మారక అవార్డ్..!
సూర్యాపేట, మనసాక్షి :
విజయవాడ కు చెందిన ప్రముఖ ఎక్స్ రే సాంస్కృతిక సంస్థ ప్రతి ఏటా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని స్మారక అవార్డు లను ఇస్తుంది. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాలలో ప్రముఖులైన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.మనం వికాస వేదిక స్థాపించి, గత మూడు దశాబ్దాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన సూర్యాపేట కు చెందిన పెద్దిరెడ్డి గణేష్ ను ఈ అవార్డ్ వరించింది.
నేడు 31 శనివారం సాయంత్రం విజయవాడ సిద్దార్థ కళాశాల ఆడిటోరియం లో ఈ అవార్డ్ ప్రధానం జరగనున్నది. ఇదే వేదిక పై ప్రముఖ నటులు
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కు ఎన్టీఆర్ విశిష్ట పురస్కారాన్ని ఇవ్వనున్నారు. పెద్దిరెడ్డి గణేష్ కు ఈ అవార్డ్ రావటం తో జిల్లా వ్యాప్తం గా ఉన్న సాహితీ ప్రియులు సంతోషం వ్యక్త పరిచి శుభాకాంక్షలు తెలిపారు.









