TOP STORIESBreaking News

Indiramma : దసరా పండుగ వేళ.. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో..!

Indiramma : దసరా పండుగ వేళ.. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తు అందిస్తున్నారు.

అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేశారు. కాగా ప్రభుత్వం పేదల కోసం మరో అడుగు ముందుకేసింది. ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకుగాను ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి కమిటీ చైర్ పర్సన్ గా ఉంటారు. మున్సిపాలిటీలో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్ పర్సన్ గా ఉంటారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా పంచాయతీ కార్యదర్శి, వార్డ్ ఆఫీసర్ ఉంటారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక బృందం సభ్యులు, ముగ్గురు స్థానికులు ఉంటారు.

ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు అనంతరం ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఇందిరమ్మ కమిటీలలో స్థానికులకే ప్రాధాన్యత కల్పించనున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు