Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా.. వారందరికీ ఖాతాలలో డబ్బులు..!

Rythu Bharosa : రైతు భరోసా.. వారందరికీ ఖాతాలలో డబ్బులు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులకు రైతు భరోసా పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని రుణమాఫీ పూర్తికాగానే రైతు భరోసా పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు పెట్టుబడి సహాయం గా ఇవ్వనున్నారు. గతంలో రైతు బంధు పథకం ద్వారా ఎకరా ఎకరానికి పదివేల రూపాయల పెట్టుబడి సహాయం అందజేసే వారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సహాయంగా ఎకరానికి 15 వేల రూపాయలు అందించనున్నారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అందజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు