Gold Price : మరోసారి గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఒక్కరోజే రూ.2200..!
Gold Price : మరోసారి గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఒక్కరోజే రూ.2200..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయికి ఎక్కింది. గతంలో తులం బంగారం ఒక లక్ష 15 వందల రూపాయలు వరకు పెరిగి మళ్ళీ తగ్గుతూ వచ్చింది. ఈసారి మరో అడుగు ముందుకేసి మరో వెయ్యి రూపాయలు పెరిగి ఆల్ టైం రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరుగుతున్న ధరల ప్రభావం బంగారం వ్యాపారంపై పడింది. మహిళలు బంగారం కొనుగోలు పట్ల నిరాసక్తత చూపుతున్నారు.
హైదరాబాదులో గురువారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 2200 రూపాయలు పెరిగి 10,25500 రూపాయలు ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ కు 2000 రూపాయలు పెరిగి 9,40,000 రూపాయలుగా ఉంది.
ఈరోజు తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల (తులం) బంగారం ధర 24 క్యారెట్స్ కు 1,02,550 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 94,000 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైనా విశాఖపట్నం, విజయవాడ , తిరుపతి, నెల్లూరు, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ :
-
Nalgonda : రూ.500 నోటు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ కు కారణం..!
-
Miryalaguda : గెస్ట్ మహిళ ఉపాధ్యాయుల కొరకు దరఖాస్తుల స్వీకరణ..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఆర్టిఏ అధికారి..!
-
Miryalaguda : మిర్యాలగూడలో సాండ్ బజార్.. తక్కువ ధరకే ఇసుక..!
-
Good News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!









