మిర్యాలగూడ వాసికి.. ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు..!
మిర్యాలగూడ వాసికి.. ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసి ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం మరియు బుధవారం అభ్యర్థులకు అందించిన నియామక పత్రాలలో పోలీస్ మరియు గురుకుల లైబ్రేరియన్ విభాగాలలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రావిరాల అంజయ్య- జయమ్మల పెద్ద కుమారుడు రావిరాల అజయ్ చంద్ర ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి గృహిణి. అజయ్ చంద్ర బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పోలీసు కానిస్టేబుల్ ఐటి మరియు కమ్యూనికేషన్ విభాగంలో నియామక పత్రాలు తీసుకొనగా మరుసటి రోజు గురువారం గురుకుల స్కూల్ లైబ్రేరియన్ మరియు గురుకుల డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ గా నియామక పత్రాలు అందుకున్నారు.
హైదరాబాదులోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పూర్తీ చేసారు. ఎన్ టి ఏ నిర్వహించె యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో పలుమార్లు ఉతీర్ణత సాధించారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
ALSO READ : మిర్యాలగూడ : కాలు విరిగిందని ఆసుపత్రికి వెళ్తే.. తొమ్మిది ఏళ్ల బాలిక మృతి..!









