మిర్యాలగూడ : కాలు విరిగిందని ఆసుపత్రికి వెళ్తే.. తొమ్మిది ఏళ్ల బాలిక మృతి..!

కాలు విరిగిందని ఆసుపత్రికి బాలికను తీసుకెళ్తే వైద్యం వికటించి తొమ్మిది ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది.

మిర్యాలగూడ : కాలు విరిగిందని ఆసుపత్రికి వెళ్తే.. తొమ్మిది ఏళ్ల బాలిక మృతి..!

మిర్యాలగూడ , మన సాక్షి :

కాలు విరిగిందని ఆసుపత్రికి బాలికను తీసుకెళ్తే వైద్యం వికటించి తొమ్మిది ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం ఇర్కిగూడెం కు చెందిన దాసరి మల్లయ్య కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు.

ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తన కుమార్తె మీనాక్షి (9) బాలికకు కాలు విరిగింది . కాగా ఆ బాలికను మిర్యాలగూడ పట్టణంలోని సాయి ఎముకల వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు శ్రీనివాసరాజు ఆమె కాలుకు ఆపరేషన్ చేయాలని సూచించాడు.

ALSO READ : తెలంగాణలో నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల..!

దాంతో శుక్రవారం బాలికను ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లిన వైద్యుడు అన్నస్తిసియా డాక్టర్ పర్యవేక్షణ లేకుండానే మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు బాధితులు ఆరోపించారు. కొద్దిసేపటికి బాలిక అపస్మారక స్థితిలోకి పోవడం.. వెంటనే డాక్టర్ బయటకు వచ్చి బాలికను హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పి స్వయంగా అతనే ఆంబులెన్స ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

అప్పటికే మృతి చెందిందని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం రాత్రి బాలిక మృతదేహంతో రెడ్డి కాలనీలోని ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బాధితులతో వైద్యుడు రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం.

ALSO READ : ఉచిత విద్యుత్ కు ఆధార్ లేనివారికి గుడ్ న్యూస్..!