ఉచిత విద్యుత్ కు ఆధార్ లేనివారికి గుడ్ న్యూస్..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడానికి కసరత్తు సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుకు చర్యలు చేపట్టారు.

ఉచిత విద్యుత్ కు ఆధార్ లేనివారికి గుడ్ న్యూస్..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడానికి కసరత్తు సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గృహజ్యోతి అమలు ప్రక్రియ కొనసాగుతుంది. అందుకుగాను ఉచిత విద్యుత్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ పథకానికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలని, ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు మొదట్లో జారీ చేసింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయడానికి ఆధార్ కార్డు అవసరమని తెలిపింది. ఆధార్ కార్డు ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

ALSO READ : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల్లో సమాంతర రిజర్వేషన్లు..!

దీనికోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వులు నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. ఇంటిలో విద్యుత్ మీటర్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ ను విద్యుత్ సిబ్బందికి అందించాలని కోరింది.

ఆధార్ లేకపోతే తక్షణమే దరఖాస్తు చేసుకుని దాని వివరాలు అందించాలని సూచించింది. ఆధార్ రానివారు బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, కిసాన్ పాస్ బుక్ ఇచ్చి పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పింది.

ALSO READ : నల్లగొండ క్లాక్ టవర్ వద్ద కేసీఆర్ ను కుర్చీలో కూర్చోబెట్టి.. కాంగ్రెస్ వినూతన నిరసన..!