తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల్లో సమాంతర రిజర్వేషన్లు..!

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఒక శుభవార్త తెలియజేసింది. ఉద్యోగ నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల్లో సమాంతర రిజర్వేషన్లు..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఒక శుభవార్త తెలియజేసింది. ఉద్యోగ నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయడానికి నిర్ణయించింది. ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ కేటాయించకుండానే ఈ ఓసీ, డబ్ల్యూ ఎస్ , ఎస్సీ, ఎస్టీ ,బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, క్రీడ విభాగాలలో సమాంతరంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

గతంలో ఇచ్చిన 41/1996 జీవో 56/1996 లో రద్దు చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ గా జారీ చేస్తుందని తెలిపారు.

ALSO READ : మాకు కొట్లాట కొత్తేమీ కాదు.. కేటీఆర్ ట్వీట్ ఆసక్తి కరం..!

మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేయకూడదని రాజ్యాంగం రూల్స్ ప్రకారం సమాంతరంగా అమలు చేయాలని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు అనుగుణంగానే టీఎస్పీఎస్సీ ఇతర నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని నియామకాలకు రోస్టర్ పాయింట్ లేకుండా మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.

ALSO READ : మేడిగడ్డపై సమగ్ర విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవాలి..!