మేడిగడ్డపై సమగ్ర విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవాలి..!

మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కే ఆర్ ఎం బి పై తక్షణమే అఖలపక్ష సమావేశం నిర్వహించాలని, నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలి.

మేడిగడ్డపై సమగ్ర విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవాలి..!
కెఆర్ఎంబిపై అఖిల పక్షం పెట్టాలి. జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ, మనసాక్షి :

మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కే ఆర్ ఎం బి పై తక్షణమే అఖలపక్ష సమావేశం నిర్వహించాలని, నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలి. మేడిగడ్డ ప్రాజెక్టును బొందల గడ్డగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కెసిఆర్ పై మండిపడ్డారు.

గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయంలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్ని ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయ్యాయని గత ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు మాత్రమే శంకుస్థాపనలు చేశారని ఏ ఒక్క కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయలేదని విమర్శించారు.

బి ఆర్ఎస్ పాలనలో రైతాంగానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. వాస్తవానికి కెసిఆర్ నల్లగొండ బహిరంగ సభకు వచ్చేటప్పుడు క్షమాపణ చెప్పి రావాల్సిందని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగలేదని ప్రతిపక్ష నాయకులకు సమయం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు రచ్చబండ, పిట్టల సభగా సాగుతున్నాయని దుయ్య బట్టారు.

ALSO READ : అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం..!

జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య రాష్ట్రంలో ప్రధాన చర్చ, నిరుద్యోగుల సమస్యలు, ప్రజల సమస్యల పై చర్చలు నిర్వహించకుండా అసెంబ్లీ రచ్చబండ గా జరుగుతున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ఉదాత్తంతంగా నడవాలని పేర్కొన్నారు.

కేంద్రాల్లో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాల అవలంబిస్తూ దేశాన్ని కార్పొరేట్ వర్గాలకు అప్పజెప్తూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చెయ్యడాన్ని నిరసిస్తూ శుక్రవారం జరుగు గ్రామీణ భారత్ బంద్ కు సిపిఐఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 2015లొ శంకుస్థాపన చేసిన చర్లగూడెం రిజర్వాయర్ కనీసం భూ నిర్వాసితులకు కూడా పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదు డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుండి నీరు తీసుకోవాలో కనీసం డి పి ఆర్ కూడా ఈ ప్రభుత్వము రూపొందించలేదన్నారు.

ALSO READ : Telangana : శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. అధికార పక్ష సభ్యుల విచిత్ర కామెంట్..!

నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగినది ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టానని ఊపడంప్పుడు ఉపన్యాసాలు తప్ప ఈ పది సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని తెలిపారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని అస్పష్టంగా తయారుచేసి సంవత్సరాలు తరబడి సాగు తాగునీరు ఇవ్వకుండా మునుగోడు దేవరకొండ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగినది ఇవాళ మళ్లీ వచ్చి కేసీఆర్ నిన్న జరిగిన బహిరంగ సభలో శుద్ధ అబద్ధాలు మాట్లాడని ఆ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో సీ పి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ. తదితరులు పాల్గొన్నారు.