Telangana : శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. అధికార పక్ష సభ్యుల విచిత్ర కామెంట్..!

శాసనసభలో బుధవారం బడ్జెట్ పై చర్చ కొనసాగుతుంది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులకు అధికారపక్ష సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుంది.

Telangana : శాసనసభ నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్.. అధికార పక్ష సభ్యుల విచిత్ర కామెంట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో..!

శాసనసభలో బుధవారం బడ్జెట్ పై చర్చ కొనసాగుతుంది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులకు అధికారపక్ష సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ సభలో.. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మేడిగడ్డ మేము వెళ్తుంటే ఏం పీకడానికి వెళ్లారని.. అభ్యంతరకరంగా మాట్లాడుతారా..? అని ప్రశ్నించారు.

ఎన్నికల్లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్యాంటు కూడా ఊడ పీకారని.. అయినా బుద్ధి రాలేదన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా చంపుతారా..? అంటూ కేసిఆర్ ప్రశ్నించడం ఏంటని, చచ్చిన పాముని ఎలా చంపుతామని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. దాంతో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి భాష సరిగా లేదని అందుకు తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లుగా వెళ్లిపోయారు.

అనంతరం అధికారపక్ష సభ్యులు మాట్లాడుతూ వాళ్ళు సభ ప్రారంభమైన నాటి నుంచే ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నారని, సభ ప్రారంభానికి ముందు కూడా కిటికీల డోర్ కర్టనులు ఎత్తి చూసి లోపలికి వచ్చారని, చిన్న పిల్లల చేస్టల్లాగా వ్యవహరించారని పేర్కొన్నారు. పెళ్లిళ్లు ఉన్నాయని వాళ్ల సభ్యుడు అడిగింది గుర్తు చేస్తూ పెళ్లిళ్లకు వెళ్లాల్సి ఉండటం తోటి వాళ్లు ఏదో ఒక కారణంతో వాకౌట్ చేస్తున్నారని పేర్కొన్నారు. శాసనసభ నుంచి టిఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసింది ఎందుకో.వ? మీరు కామెంట్ చేయొచ్చు..!

ALSO READ : నల్లగొండ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీటుగా కౌంటర్..!