Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

Free Coaching : నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్..!

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువకుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఎస్సై కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించామని టాస్క్ సిఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

Free Coaching : నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్..!

వెల్దండ, మన సాక్షి :

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువకుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఎస్సై కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభించామని టాస్క్ సిఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగ పర్చుకోవాలని ఆయన అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల సాధనలో ఆర్థిక అడ్డంకులతో ఎవరు ఆగిపోవద్దని ఉద్దేశంతో , హైదరాబాద్ ప్రభుత్వ అకాడమీలకు ధీటుగా వెల్దండ మండల కేంద్రంలో అనుభవజ్ఞులైన అత్యుత్తమ ఫ్యాకల్టీతో తరగతుల శిక్షణలు అందిస్తున్నామని , పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులు సద్విని పర్చుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు