నల్లగొండ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీటుగా కౌంటర్..!

కెసిఆర్ సత్య హరిశ్చంద్రుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఆయన నిజంగా సత్యహరిశ్చంద్రుడే అయితే.. అసెంబ్లీకి రావాలి. కృష్ణానదిపై ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే సభకు ఎందుకు రాలేదు..? నల్లగొండ సభకు వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

నల్లగొండ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీటుగా కౌంటర్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కెసిఆర్ సత్య హరిశ్చంద్రుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఆయన నిజంగా సత్యహరిశ్చంద్రుడే అయితే.. అసెంబ్లీకి రావాలి. కృష్ణానదిపై ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే సభకు ఎందుకు రాలేదు..? నల్లగొండ సభకు వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీటుగా కౌంటర్ ఇచ్చారు. మంగళవారం కాలేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రులు , ఎమ్మెల్యేలు అంతా కలిసి కాలేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు .

కాలేశ్వరంలో అవినీతిని ఎత్తి చూపారు. ఈ సందర్భంగా కెసిఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నీ దోపిడీకి మేడిగడ్డ బలైందని , అన్నారం .. సుందిళ్ల సున్నమైందని, సక్కగా లేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్యం ఎలా మద్దతు తెలిపారు అన్నారు. ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని సభకు వచ్చి చెప్పాలి.. ఉద్యమ ముసుగులో మంది పిల్లలను చంపి మేము అధికారం చేపట్టలేదు అన్నారు.

ALSO READ : నల్లగొండ క్లాక్ టవర్ వద్ద కేసీఆర్ ను కుర్చీలో కూర్చోబెట్టి.. కాంగ్రెస్ వినూతన నిరసన..!

మేడిగడ్డ కుంగిన కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని కాలేశ్వరం సమస్యను పక్కదారి పట్టించేందుకే నల్లగొండలో సభ పెట్టారని విమర్శించారు. బాధ్యతను విస్మరించి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నాడని, కుర్చీ పోగానే కేసీఆర్ ఫ్లోరైడ్ బాధితుల కన్నీళ్లు గుర్తుకొచ్చాయా అన్నారు. అసెంబ్లీలో విపక్ష నేతగా బుధవారం కేసీఆర్ సభకు రావాలని, స్వార్థం కోసం ప్రజలను వాడుకోవద్దని పేర్కొన్నారు.

ఏనుగు పోయింది తోకే మిగిలింది అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో బాధ్యతారాహితంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని, నీళ్లు నింపితే కుప్పకూలిపోతుందన్నారు. ఇంత పెద్ద లోపాన్ని చిన్నతప్పిదంగా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. అసెంబ్లీకి వచ్చి కాలేశ్వరం ప్రాజెక్టుపై స్టాండ్ ఏంటో చెప్పాలని, కెసిఆర్ ఓట్లు అడుక్కోవడానికి కొత్త అవతారం ఎత్తారన్నారు. నల్లగొండ సభకు జనం రాకుంటే మహబూబ్నగర్ నుంచి తీసుకెళ్లారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ALSO READ : Nalgonda : కెసిఆర్ ను తిరగనివ్వరట.. చంపేస్తారా..!

బిజెపి, టిఆర్ఎస్ ఒకటేనా..? ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు ఒకే గ్రూప్ కు చెందినవారా..? అని ప్రశ్నించారు. మేడిగడ్డ సందర్శనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించామని , బిజెపి ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో కుమ్మక్కు అవడానికే ఇక్కడికి రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.