నల్లగొండ క్లాక్ టవర్ వద్ద కేసీఆర్ ను కుర్చీలో కూర్చోబెట్టి.. కాంగ్రెస్ వినూతన నిరసన..!

నల్లగొండకు అన్యాయం చేసింది మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ అని డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ఆరోపించారు.

నల్లగొండ క్లాక్ టవర్ వద్ద కేసీఆర్ ను కుర్చీలో కూర్చోబెట్టి.. కాంగ్రెస్ వినూతన నిరసన..!

నలగొండ , మనసాక్షి :

నల్లగొండకు అన్యాయం చేసింది మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ అని డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని మర్రిగూడ బైపాస్ లో నిర్వహిస్తున్న సభకు కేసీఆర్ రావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో వినూత్న నిరసన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు చేపట్టారు.

నిరసన కార్యక్రమాన్ని డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ లు ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ 10 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ ప్రజలు కేసీఆర్ పాలనలో తీవ్ర అన్యాయానికి గురి అయిందన్నారు. నల్లగొండ సెంటర్లో కుర్చీ వేసుకొని నల్లగొండని అభివృద్ధి చేస్తా అని మాయమాటలు చేప్పారని, నల్లగొండలో అభివృద్ధి కాదు అన్యాయం చేసి ఏం మొహం పెట్టుకుని నల్లగొండకు వస్తున్నారని ప్రశ్నించారు.

ALSO READ : BREAKING : అసెంబ్లీ అయ్యాక మేము కూడా మేడిగడ్డకు పోతాము.. కెసిఆర్..!

కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పై నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సభలో పస లేదని కేఆర్ ఎం బి ని రాష్ట్ర పరిధిలో ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని అసెంబ్లీలో తీర్మానం చేయడంతో ఎం మాట్లాడాలో తెలియని అయోమయంలో కేసీఆర్ పడ్డారని అన్నారు.10 ఏండ్లు నల్లగొండను నిండా ముంచారని ఆరోపించారు.

సాగు, తాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి ఆంధ్రకు న్యాయం చేశారని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రసారం చేశారు.కేసీఆర్ డౌన్ డౌన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, మాజీ గ్రంథాలయ చైర్మన్ రేఖల భద్రాది, డిసిసి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, నల్గొండ ఎంపీపీ మనిమద్దె సుమన్,

జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి దుబ్బరూప, మహిళా పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కర్నాటి కర్ణాకర్ రెడ్డి, బసీరుద్దీన్,ఏర్పుల రవి, ఎండి కలీం, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు జూకూరి రమేష్, వంగాల అనిల్ రెడ్డి, సంకు ధనలక్ష్మి, జేరిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్,స్వరూప రెడ్డి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : కెసిఆర్ ఆఖరి అస్త్రం.. నల్లగొండలో సెంటిమెంటు రగిలించే ప్రయత్నమేనా..?