కెసిఆర్ ఆఖరి అస్త్రం.. నల్లగొండలో సెంటిమెంటు రగిలించే ప్రయత్నమేనా..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పదేళ్లపాటు కాలం గడిపింది. దాంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చావు దెబ్బ తగిలింది.

కెసిఆర్ ఆఖరి అస్త్రం.. నల్లగొండలో సెంటిమెంటు రగిలించే ప్రయత్నమేనా..?

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పదేళ్లపాటు కాలం గడిపింది. దాంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చావు దెబ్బ తగిలింది. తెలంగాణలోని పేదల గురించి పట్టించుకోని ప్రభుత్వం జాతీయ పార్టీగా బీ ఆర్ ఎస్ గా ప్రకటించుకుని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వెళుతున్నట్లు ప్రకటించుకున్నాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు వ్యతిరేక తీర్పు నుంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పదేళ్ల హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై విచారణలు జరుపుతున్నారు. దాంతో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.

కాగా మళ్లీ తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తుండా..? నల్లగొండ వేదికగా కృష్ణా జలాల పై పోరు బాట సాగించే ప్రయత్నం చేస్తున్నారా..? కృష్ణా జలాలను ప్రాజెక్టులను కేఆర్ ఎంబికి అప్పగించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో పాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు.

ALSO READ : BIG BREAKING : సూర్యాపేటలొ బి ఆర్ ఎస్ కు గట్టి దెబ్బ.. ముకుమ్మడి రాజీనామా చేసిన 15 మంది అసమ్మతి కౌన్సిలర్లు..!

అయినా కూడా నల్లగొండ సభలో కృష్ణ ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఆర్ ఎంబీ కి అప్పగించిందని, ఆంధ్రకు నీటిని తరలించే అవకాశం ఉందని ప్రజల్లో సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేయనున్నారా..? ఇది ఇలా ఉండగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే .

మరి కొంత మంది బడా నేతలు సీనియర్ నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీని రక్షించుకోవడానికి అధికారం కోల్పోయిన రెండు మాసాల్లో ఉద్యమాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. నల్లగొండ బహిరంగ సభ వేదికగా మళ్లీ నీటి తగాదాలు తెరపైకి తీసుకొచ్చి సెంటిమెంటు రగిలించే ప్రయత్నం చేయబోతున్నారా..? కేసీఆర్ ఆఖరి అస్త్రంగా సెంటిమెంట్ ప్రకటించేందుకు ప్రయత్నం చేయబోతున్నారా..? ఈసారి ప్రజలు సెంటిమెంటుకు ఎలా మద్దతు ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

ALSO READ : NALGONDA : బిఆర్ఎస్ తొలి పోరాటం నల్లగొండ నుండే.. బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి..!