Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

BIG BREAKING : సూర్యాపేటలొ బి ఆర్ ఎస్ కు గట్టి దెబ్బ.. ముకుమ్మడి రాజీనామా చేసిన 15 మంది అసమ్మతి కౌన్సిలర్లు..!

BIG BREAKING : సూర్యాపేటలొ బి ఆర్ ఎస్ కు గట్టి దెబ్బ.. ముకుమ్మడి రాజీనామా చేసిన 15 మంది అసమ్మతి కౌన్సిలర్లు..!

త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటు వెల్లడి

సూర్యాపేటలొ బి ఆర్ ఎస్ కు గట్టి దెబ్బ

సూర్యాపేట, మనసాక్షి:

సూర్యాపేట పట్టణంలోని మునిసిపాలిటీ చెందిన 16 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్ ఆ పార్టీకి రాజీనామా చేసి త్వరలో కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా వారు విలేకరుల సమావేశం లొ మాట్లాడుతూ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో అభివృద్ధి మాటున జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే నన్ను పార్టీ నుంచి బహిష్కరించారని 32వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి అన్నారు.

బిఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి, కౌన్సిలర్ నిఖిల లకు మద్దతుగా 15 మంది బిఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్స్ మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజినామ చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం పట్టణంలోని కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

బిఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి విలువ లేదన్నారు. జనంలో మంచిగా ఓ వ్యక్తి ఎదిగితే జగదీష్ రెడ్డికి నచ్చదని ఎలాగైన సరే అనిచి వేస్తారని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తారా పదేళ్ల నుంచి పని చేసిన మాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రశ్నించారు.

కనీసం మా వార్డులో జరిగిన అభివృద్ధి పనుల్లో శిలాఫలకాలపై కౌన్సిలర్ల పేరు పెట్టేందుకు కూడా అంగీకరించలేదన్నారు. టిఆర్ఎస్ అహంకారానికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఇక్కడ అలాంటి సమయం వస్తుందన్నారు. జగదీష్ రెడ్డి మూడుసార్ల గెలుపులో మేము కీలకపాత్ర పోషించామని మున్సిపాలిటీలో తప్ప ఆయనకి ఎక్కడ ఓట్లు పడలేదన్నరు.

ALSO READ : కృష్ణా జలాలు కెఆర్ఎంబీ కి అప్పగించే ప్రసక్తే లేదు.. కెసిఆర్ ఎక్కడ దాక్కున్నాడు, సభలోకి ఎందుకు రాడు.. రేవంత్..!

మేం వార్డులో ఉంటామని ప్రజల మనుషులుగా చలామణి అవుతామని ప్రజా సమస్యలపైనే అవిశ్వాసానికి వెళ్ళామన్నారు. బిఎస్పీలో చేరిన కృపాకర్ ను దగ్గరకు తీసుకున్న జగదీశ్ రెడ్డి మమ్మల్ని దూరం పెట్టి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం విచారకరమన్నారు.

పట్టణ పార్టీ అధ్యక్షుడు సవరల సత్యనారాయణకు తమను బహిష్కరించేందుకు సంతకం చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. మేమంతా కలిసికట్టుగా ఉంటామని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.

ALSO READ : NALGONDA : బిఆర్ఎస్ తొలి పోరాటం నల్లగొండ నుండే.. బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి..!

సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు బచ్చలకూరి శ్రీనివాస్, జహీర్, ఎలిమినేటి అభినయ్, అనపర్తి రాజేష్, అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్, మామిడి గౌరయ్య, జ్యోతి కరుణాకర్, రవి నాయక్, నాయకులు గండూరి రమేష్, లింగా నాయక్, సిరివెళ్ల శబరి, కుంభం రాజేందర్, మకట్ లాల్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు