కృష్ణా జలాలు కెఆర్ఎంబీ కి అప్పగించే ప్రసక్తే లేదు.. కెసిఆర్ ఎక్కడ దాక్కున్నాడు, సభలోకి ఎందుకు రాడు.. రేవంత్..!

కృష్ణాజిల్లాలను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు.

కృష్ణా జలాలు కెఆర్ఎంబీ కి అప్పగించే ప్రసక్తే లేదు.. కెసిఆర్ ఎక్కడ దాక్కున్నాడు, సభలోకి ఎందుకు రాడు.. రేవంత్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో:

కృష్ణాజిల్లాలను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో వారు కృష్ణాజిల్లాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. 2023 డిసెంబరు 1వ తేదీన కృష్ణా జలాలను కేర్ ఎంబీ కి అప్పగించితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్మిత సబర్వాల్ ద్వారా లేఖ రాశారని రేవంత్ రెడ్డి లేక ప్రజలలో అసెంబ్లీలో చూపారు.

కెసిఆర్ ఎందుకు రారు:

తెలంగాణకు అతి ముఖ్యమైన కృష్ణ జలాల పై సభలో చర్చ సాగుతుంటే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభలోకి ఎందుకు రాడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జలాలను ఆంధ్రకు దోచిపెట్టి అన్యాయం చేసిన కేసీఆర్ సభలోకి ఎందుకు రావట్లేదని నిలదీశారు. కెసిఆర్ సభలోకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలని పేర్కొన్నారు.

కృష్ణా జలాల పైన తెలంగాణ జీవనాధారం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారని ఆయన కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఫామ్ హౌస్ లో దాక్కున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.

ALSO READ : సీఎం రేవంత్ పై అభ్యంతరకర పోస్టు.. ఇద్దరిపై కేసు..!