NALGONDA : బిఆర్ఎస్ తొలి పోరాటం నల్లగొండ నుండే.. బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి..!

కే ఆర్ ఎం బి కి నాగార్జునసాగర్ , శ్రీశైలం ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా కేంద్రంలో తలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

NALGONDA : బిఆర్ఎస్ తొలి పోరాటం నల్లగొండ నుండే.. బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి..!

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.

సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిఆర్ఎస్ పార్టీ

నల్లగొండ, మన సాక్షి:

కే ఆర్ ఎం బి కి నాగార్జునసాగర్ , శ్రీశైలం ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పజెప్పడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా కేంద్రంలో తలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గత మూడు రోజులుగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ , సభ ఇన్చార్జ్ రవీందర్ సింగ్,  జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ , మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు, ఏర్పాట్లను పరిశీలించారు.

బహిరంగ సభ జరిగే ప్రాంతం మొత్తం కేసిఆర్ ఫ్లెక్సీలు కట్అవుట్లు ఏర్పాటు చేసి బారికెట్లు నిర్మించారు. ఈ సభకు ఉమ్మడి నల్గొండ , ఖమ్మం, మహబూబ్నగర్ ,జిల్లాల కు చెందిన సుమారు రెండు లక్షల మంది ప్రజలను తరలించనున్నారు. సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టనున్నారు. కేఆర్ ఎంబికి ప్రాజెక్టులను అప్పజెప్పడం వలన జరిగే నష్టాన్ని రైతులకు వివరించనున్నారు.

ALSO READ : కృష్ణా జలాలు కెఆర్ఎంబీ కి అప్పగించే ప్రసక్తే లేదు.. కెసిఆర్ ఎక్కడ దాక్కున్నాడు, సభలోకి ఎందుకు రాడు.. రేవంత్..!

10 సంవత్సరాలుగా తమ ప్రభుత్వం కేఆర్ఎంపీకి ఎందుకు ప్రాజెక్టును అప్పజెప్పలేదు స్పష్టం చేయనున్నారు . బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ
కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికార ఒప్పందం ఉంది అని తెలిపారు. ఏపీ నేతలకు కాంగ్రెస్ నేతలు ఏజెంట్లుగా మారారు అన్నారు.
కాంగ్రెస్ నేతల చేతకానితనం వల్లే కృష్ణా జలాలపై హక్కుని కోల్పోయాం అని విమర్శించారు.
జలాల విషయంలో కేంద్రంపై పోరాడాల్సింది పోయి మా పై ఎదురు దాడి చేయడం దురదృష్టకరం
అన్నారు.

సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనం వల్లే,కృష్ణా నది ప్రాజెక్టుల హక్కులను కోల్పోయామని క్రిష్ణా నది పై అన్న ప్రాజెక్టుల సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ సభను తలపెట్టినట్లు తెలిపారు .కేసీఆర్ సభ కొసం క్రిష్ణా పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు ఆత్రుత గా ఎదురు చూస్తున్నారని అన్నారు. సభ కు లక్షలాది గా తరలిరావడం కోసం స్వచ్చందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారని అన్నారు .

కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ సీఎం, మంత్రులు సాగర్ ప్రాజెక్టుకు ఎందుకు వెళ్లడం లేదనీ ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సాగర్ ప్రాజెక్టును ఆక్రమించడానికి ఏపీ వస్తే మేమే తరిమామని అన్నారు.కృష్ణా జలాల వివాదం అనేది తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య గా అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాల్లు కృష్ణానదీ ప్రాజెక్టులు మా కంట్రోల్ లోనే ఉన్నాయనీ పేర్కొన్నారు.

ALSO READ : BREAKING : ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి.. కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్..!

కృష్ణా జాలల హక్కులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడాన్ని ఏపి ప్రభుత్వం ఒప్పుకున్నా… అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకోలేదన్నారు.కాంగ్రెస్ నేతలు ఏపి నేతలకు ఏజెంట్ లు గా మారారని ఫైర్ అయ్యారు.కాంగ్రెస్ నేతలు తెలంగాణ ద్రోహులుగా మారారని పేర్కొన్నారు. కృష్ణ జలాల హక్కు విషయంలో కేంద్రం పై పోరాడాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు మాపై ఎదురుదాడి చేయడం దురదృష్టకరం అన్నారు.

కృష్ణా జలాల హక్కులపై బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి అప్పగించలేదని కాంగ్రెస్ తీర్మానం చేసిందని అన్నారు.కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది అన్నారు.