Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

BREAKING : అసెంబ్లీ అయ్యాక మేము కూడా మేడిగడ్డకు పోతాము.. కెసిఆర్..!

BREAKING : అసెంబ్లీ అయ్యాక మేము కూడా మేడిగడ్డకు పోతాము.. కెసిఆర్..!

నల్గొండ , మన సాక్షి :

మేడిగడ్డలో ఏముందని కాంగ్రెస్ నాయకులు పోయారని, అసెంబ్లీ అయిపోయాక మేము కూడా పోతామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం నల్గొండ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మేడిగడ్డలో మొత్తం ఏం జరిగిందో ప్రజలకు వివరిస్తామన్నారు.

కాలేశ్వరం అంటే ఒక మెడిగడ్డ మాత్రమే కాదని, రెండు, మూడు పిల్లర్లు కృంగిపోయినంత మాత్రాన ఏం జరిగిందని అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించినవి గతంలో ఎన్నో జరగలేదా అన్నారు. మూసి ప్రాజెక్టు గేట్లు కూడా కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు ఇలాగే మాట్లాడాలా..? అని కెసిఆర్ అన్నారు.

ALSO READ : నల్లగొండలో బీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం..!

అహంకారంతో మాట్లాడుతున్నారని, ప్రజల సమస్యల మీద అవగాహన లేదని కాంగ్రెస్ వాళ్లకు సంస్కారం లేదని కృష్ణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ఆర్ ఎంబీ కి అప్పగించమంటున్నారని సీనియర్లైన మమ్ములను అడగాలని ఆయన అన్నారు.

మళ్లీ మనమే వస్తాం :

ఎవరు ఏం భయపడొద్దు.. కొట్లాడుదాం.. పోరాడుదాం.. మళ్ళీ మనమే వస్తామని కేసీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నల్గొండ సభలో ఇది రాజకీయ వేదిక కాదని.. ఎన్నికలు కూడా లేవని చెబుతూనే.. రాజకీయాలు మాట్లాడారు. ఇంకా రెండు నెలలు ఎంపీ ఎన్నికలు ఉన్నాయని చెప్పాడు.

సంపూర్ణ వాటా వచ్చే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు : 

కృష్ణ గోదావరి జిల్లాలో తెలంగాణకు రావలసిన సంపూర్ణమైన వాటా రావాలని, నిద్రపోనిచ్చే ప్రసక్తే లేదని కెసిఆర్ అన్నారు. ప్రధానమంత్రిని నిలదీయాలని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన, నల్గొండలో సభ పెట్టినంత మాత్రాన కోరుకునేది లేదని ఉద్యమాలు చేపట్టి సంపూర్ణమైన వాటా కోసం కొట్లాడాలన్నారు.

ALSO READ : నల్లగొండ : బీఆర్ఎస్ సభకు దీటుగా కేసిఆర్ అన్యాయాలపై ఎల్ఈడి స్క్రీన్ ప్రదర్శన ఎప్పుడంటే..!

నన్ను కూడా బెదిరించారు : 

రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరించారని ఆయన నిన్ను బాధపడలేదు కేసీ ఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కృష్ణ జలాలను కేంద్రానికి అప్పగించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి , నేటి పారుదల శాఖ మంత్రి రాష్ట్రంలోని అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడి అందరిని కేంద్రానికి తీసుకుపోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు