నల్లగొండ : బీఆర్ఎస్ సభకు దీటుగా కేసిఆర్ అన్యాయాలపై ఎల్ఈడి స్క్రీన్ ప్రదర్శన ఎప్పుడంటే..!

కృష్ణ ప్రాజెక్టులను కే ఆర్ ఎం బికి అప్పగించారని, ప్రాజెక్టుల పోరు బాటతో నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ మంగళవారం నిర్వహించనున్నారు. బహిరంగ సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రతిపక్షాల పోరాటం నల్గొండ నుంచే ప్రారంభించనున్నారు. కాగా నల్లగొండ కాంగ్రెస్ నాయకులు కూడా బహిరంగ సభను సవాల్ చేస్తూ కేసిఆర్ కు దీటుగా సమాధానం చెప్పాలని భావించారు.

నల్లగొండ : బీఆర్ఎస్ సభకు దీటుగా కేసిఆర్ అన్యాయాలపై ఎల్ఈడి స్క్రీన్ ప్రదర్శన ఎప్పుడంటే..!

నల్గొండ, మన సాక్షి:

కృష్ణ ప్రాజెక్టులను కే ఆర్ ఎం బికి అప్పగించారని, ప్రాజెక్టుల పోరు బాటతో నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ మంగళవారం నిర్వహించనున్నారు. బహిరంగ సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రతిపక్షాల పోరాటం నల్గొండ నుంచే ప్రారంభించనున్నారు. కాగా నల్లగొండ కాంగ్రెస్ నాయకులు కూడా బహిరంగ సభను సవాల్ చేస్తూ కేసిఆర్ కు దీటుగా సమాధానం చెప్పాలని భావించారు.

అందుకు బహిరంగ సభ రోజే మంగళవారం రాత్రి పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో కేసీఆర్ మోసాలపై, నల్లగొండకు చేసిన అన్యాయం పై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రదర్శన చేయనున్నట్లు ప్రకటించారు. సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటు ముసలి కన్నీరు కారుస్తారని, ఆయన వల్లేనల్గొండ జిల్లా ఎడారిగా మారిందని ఇందుకు సాక్ష్యంగా కెసిఆర్ గతంలో మాట్లాడిన మాటలను వీడియోలను ఎల్ఈడి స్క్రీన్ ద్వారా నేడు గడియారం సెంటర్లో ప్రజలకు ప్రదర్శిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

ALSO READ : BIG BREAKING : సూర్యాపేటలొ బి ఆర్ ఎస్ కు గట్టి దెబ్బ.. ముకుమ్మడి రాజీనామా చేసిన 15 మంది అసమ్మతి కౌన్సిలర్లు..!

సోమవారం మంత్రి కోమటిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అప్పటి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 600 కోట్లతో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం మంజూరు చేసి పనులు ప్రారంభించి 90% పూర్తయిన కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ 10 శాతం నిధులు ఇవ్వకపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని ఆరోపించారు. కోమటిరెడ్డికి ఎక్కడ పేరు వస్తుందోనని బి ఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పక్కన పెట్టిందన్నారు .

రేపు ప్రజలకు ఈ విషయం వివరిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సభ పెట్టిందో వాళ్లకు అర్థం కావడం లేదన్నారు. కృష్ణా నది నుండి ఆంధ్రప్రదేశ్ కు నీటిని ఇచ్చింది కేసీఆర్ అన్నారు. ఏది పట్టించుకోకుండా నల్లగొండని నాశనం చేసి మళ్లీ మాయమాటలు చెప్పడానికి వస్తున్నాడు అన్నారు. నల్లగొండ జిల్లాలో ఏ పని చేయాలన్న ఆంధ్ర కాంట్రాక్టర్లు ఉన్నారన్నారు. రాయలసీమను రతనాలసీమ చేస్తానని ఎందుకన్నాడో వివరించాలన్నారు.

ALSO READ : NALGONDA : బిఆర్ఎస్ తొలి పోరాటం నల్లగొండ నుండే.. బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి..!

నల్గొండ ప్రజలకు క్షమాపణలు చెప్పి నల్గొండకు రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ వల్లనే ఆంధ్రకు నీళ్లు వస్తున్నాయని అన్న మాటలను రేపు వినిపిస్తామన్నారు. గడియారం సెంటర్లో వివరాలన్నీ తెలియజేస్తామన్నారు .

ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి లక్ష్మయ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ , తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ . డీ సిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి. జూలకంటి ధనలక్ష్మి. మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్ .కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు జాంగిర్ బాబా. సైదిరెడ్డి. వెంకన్న. రామకృష్ణ. నాగిరెడ్డి .షబ్బీర్ బాబా. శ్రీను. దాసరి విజయ్. అజయ్ .విగ్నేష్. తదితరులు పాల్గొన్నారు.