Nalgonda : కెసిఆర్ ను తిరగనివ్వరట.. చంపేస్తారా..!

కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పగిస్తే నల్లగొండలో సభ పెడతామంటే కేసీఆర్ ని తిరగనివ్వమని అంటారు. ఏం చేస్తారు..? చంపేస్తారా..? కేసీఆర్ ని చంపే దమ్ముందా..? కేసీఆర్ ను చంపి బతుకుతారా..? దమ్ముంటే రండి..? ఏం చేద్దామని కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ వెళ్లారు.

Nalgonda : కెసిఆర్ ను తిరగనివ్వరట.. చంపేస్తారా..!

మేడిగడ్డ ఎందుకు పోయారు..? ఏం చేస్తారు వెళ్లి..?

రైతుబంధు ఇవ్వడానికి చేతకావట్లేదు

కృష్ణా జలాలు జీవన్మరణ సమస్య

నల్లగొండ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

నల్లగొండ, మనసాక్షి :

కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పగిస్తే నల్లగొండలో సభ పెడతామంటే కేసీఆర్ ని తిరగనివ్వమని అంటారు. ఏం చేస్తారు..? చంపేస్తారా..? కేసీఆర్ ని చంపే దమ్ముందా..? కేసీఆర్ ను చంపి బతుకుతారా..? దమ్ముంటే రండి..? ఏం చేద్దామని కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ వెళ్లారు. కేసీఆర్ మీద బురద చల్లడానికా..? దమ్ముంటే నీళ్లు వదలండి. ఒకటి, రెండు పిల్లర్లు కుంగితే రిపేర్ చేయించాలి, బాగు చేయకుంటే రాజకీయం చేస్తారా..? మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. కృష్ణా జలాల్లో వాటా వచ్చే వరకు ఊరుకునేది లేదు. వెంటాడుతామంటూ కేసీఆర్ నల్గొండ సభలో ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతలపై రెచ్చిపోయారు.

మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో చలో నల్లగొండ పేరుతో కృష్ణ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించారని ఆరోపిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి భారీ భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఇది రాజకీయ సభ కాదని , కృష్ణా జలాల సమస్య ఇది తెలంగాణకే జీవన్మరణ సమస్యగా మారిందన్నారు.

తాను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కృష్ణా జలాలను కాపాడుకున్నామని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణ జలాలను కేఆర్ఎంబికి అప్పగించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు కళ్ళు నెత్తికెక్కాయా..? రైతుబంధు అడిగినందుకు రైతులను పట్టుకొని చెప్పులతో కొడతామంటారా..? రైతుల వద్ద కూడా బలమైన చెప్పులు ఉంటాయి. ఒక్క దెబ్బ కొడితే మూడు పండ్లు ఊడిపోతాయంటూ.. కేసిఆర్ అన్నారు.

తాము అధికారం ఉన్నప్పుడు నల్లగొండలో ఫ్లోరైడ్ రహితంగా చేశామని, భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ బాధలు తీర్చామని పేర్కొన్నారు. కృష్ణ , గోదావరి కలిపి మంచిగా నీళ్లు తెచ్చామన్నారు. ఇంకా బస్వాపురం, డిండి ప్రాజెక్టులు పూర్తి కాబోతున్నాయని, పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

ALSO READ : నల్లగొండ క్లాక్ టవర్ వద్ద కేసీఆర్ ను కుర్చీలో కూర్చోబెట్టి.. కాంగ్రెస్ వినూతన నిరసన..!

పదవులు శాశ్వతం కాదని ప్రజల హక్కులు శాశ్వతమన్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా .. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతామన్నారు. కెసిఆర్ లేకుంటే రాష్ట్రంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి అన్నారు. ఒక్క సభలో మా నాయకుడు మాట్లాడుతుంటే ఏడుసార్లు కరెంటు పోయిందన్నారు.

ఇప్పుడు సచివాలయానికి జనరేటర్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని కెసిఆర్ పేర్కొన్నారు. 24 సంవత్సరాల పాటు పక్షిలా తిరుగుతూ రాష్ట్రం మొత్తం చెప్పానని, ఇది చిల్లర రాజకీయ సభ కాదని, ఎన్నికలు కూడా ఇప్పుడు లేవంటూ.. తన ఆరాటం అంతా తెలంగాణ గడ్డ కోసమే అన్నారు . తన కట్టే కాలే వరకు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు.

ALSO READ : కెసిఆర్ ఆఖరి అస్త్రం.. నల్లగొండలో సెంటిమెంటు రగిలించే ప్రయత్నమేనా..?