Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవైద్యంహైదరాబాద్

Osmania Hospital : 14 అంతస్తులలో ఉస్మానియా ఆస్పత్రి.. నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

Osmania Hospital : 14 అంతస్తులలో ఉస్మానియా ఆస్పత్రి.. నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

మన సాక్షి, హైదరాబాద్ :

అత్యాధునిక వైద్య సౌకర్యాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించాలనే లక్ష్యంతో నూతనంగా నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో పాటు ఇతర మంత్రులతో కలిసి ఆయన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్ గంజ్ లో ఉన్న విషయం తెలిసిందే. కాగా నూతనంగా నిర్మించబోయే ఆస్పత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. మొత్తం 26.3 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. రెండు వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు.

2400 కోట్ల రూపాయలతో 14 అంతస్తులో కార్పొరేట్ ఆసుపత్రులను మించేలా ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 30 విభాగాలలో వైద్య సేవలు అందించేలా రాబోయే వంద సంవత్సరాల అవసరాలకు తగినట్లుగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

నూతనంగా నిర్మించబోయే ఆసుపత్రిలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, రోబోటిక్ సర్జరీలు చేసేలా విభాగాలను తీర్చిదిద్దనున్నారు. ప్రతిరోజు 5000 మంది ఓపి రోగులను చూసేలా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు