Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజాతరలుజిల్లా వార్తలునల్గొండ

CM Revanth : ఫిబ్రవరి 16న పెద్దగట్టు జాతర.. నిధుల కేటాయింపుకు సీఎం రేవంత్ ఆదేశం..!

CM Revanth : ఫిబ్రవరి 16న పెద్దగట్టు జాతర.. నిధుల కేటాయింపుకు సీఎం రేవంత్ ఆదేశం..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి వినతి

మిర్యాలగూడ, మన సాక్షి :

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహించే పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఈ మేరకు విన్నవించారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 16 నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు కావాల్సిన నిధుల ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

జాతరకు దేశవ్యాప్తంగా భారీగా భక్తజనం తరలిరానున్న నేపథ్యంలో మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయనున్నారు. గత ప్రభుత్వాల హయాంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఈసారి శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని సూచించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు వేయాలని తెలిపారు.

ఎంపీ రఘువీర్ రెడ్డి కి యాదవ సంఘం నాయకులు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌని రాజారామ్ రమేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పెద్దగట్టు జాతరకు సౌకర్యాలు కల్పించేలా నిధులు విడుదల చేయాలని ఎంపీ ని కోరుతూ వినతి పత్రం సమర్పించడంతో వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెద్దగట్టు జాతర కు నిధులు విడుదల చేయాలని కోరారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అధికారులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

MOST READ : 

  1. Miryalaguda : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మొబైల్ ద్వారా నగదు రహిత రైల్వే టికెట్..!

  2. 1962 : సమ్మెకు సిద్ధమైన 1962 సిబ్బంది.. నిలిచిపోనున్న పశు సంచార వాహన సేవలు..!

  3. Miryalaguda : తప్పిపోయిన తహసిల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్.. సాగర్ కాలువలో మృతదేహం లభ్యం..!

  4. Elections : పంచాయతీరాజ్ శాఖ పై సీఎం రేవంత్ సమీక్ష.. సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు