Exams : తల్లిదండ్రులకూ.. పరీక్షా కాలమే..!
Exams : తల్లిదండ్రులకూ.. పరీక్షా కాలమే..!
నిజామాబాద్ జిల్లా (భీంగల్), మన సాక్షి :
పరీక్షల కాలం దూసుకొస్తోంది. పది, ఇంటర్ పరీక్షలకు మరి కొన్నిరోజులు మాత్రమే గడువు ఉంది. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని విద్యార్థులు, తమ పిల్లలు మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడిని అధిగమించేందుకు తల్లిదండ్రులు కొద్దిగా శ్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీటికి దూరంగా ఉండాల్సిందే..
పది, ఇంటర్ చదివే విద్యార్థులు ఈ కొన్నాళ్లు టీవీలకు దూరంగా ఉండాలి. చరవాణుల జోలికిపోవద్దు. తమ ఇళ్లలో వివాహ, ఇతర శుభకార్యాలను వీలుంటే వాయిదా వేసుకోవచ్చు. ఇతరుల శుభకార్యాలకు వెళ్లి రావడానికి సమయం వృథా కాకుండా ప్రణాళికతో వ్యవహరించాలి. పట్టణాల్లో తల్లిదండ్రులు ఇప్పటికే ఈ విధానాలను అమలు చేస్తున్నారు. పల్లెల్లోనూ వీటిని అమలు చేయడం పెద్ద పనేం కాదు. కాకపోతే కాస్త ఓపికతో తల్లిదండ్రులే పిల్లలకు చెప్పాలి.
అభ్యసనకు అనుకూల వాతావరణం..
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రైవేటుతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవ ఉపాధ్యాయ, అధ్యాపక బృందాలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ దశలో తల్లిదండ్రులూ ఇంటి వద్ద మార్గదర్శనం చేయాలి. పిల్లల ఏకాగ్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. టీనేజ్లో వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు కోపోద్రిక్తుల్ని చేస్తాయి. ఐనా.. సంయమనం పాటించాలి. వారికి చెప్పే ప్రతి అంశం సూచనాత్మకంగా ఉండాలి.
MOST READ :
-
UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
District collector : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..!









