District Collector : నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District Collector : నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ అధ్యక్షతన డి.ఎల్.ఎస్.సి( డిస్టిక్ లెవెల్ స్యాoడ్ కమిటీ) సమావేశం ఏర్పాటు చేశారు.
మాగనూర్ మండలం అడవి సత్యవార్ కు చెందిన నలుగురు రైతులు, వర్కూర్ కు చెందిన మరో రైతు తమ పట్టా భూముల నుంచి ఇసుకను తొలగించాలని దరఖాస్తు చేసుకోగా సోమవారం నాటి సమావేశంలో ఆ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక తరలింపు విషయంలో మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జల శాఖ, సర్వే ల్యాండ్, నీటి పారుదల,వ్యవసాయ శాఖల అధికారుల నివేదికలు, అభిప్రాయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
సమావేశంలో మైనింగ్ ఏడి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ఇచ్చిన నివేదికలన్ని సరిగ్గా ఉన్నాయని, దరఖాస్తుదారుల పట్టా భూముల నుంచి ఇసుక తొలగించేందుకు అనుమతులు ఇవ్వ వచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు రిపోర్టుల ఆధారంగా అనుమతికి కలెక్టర్ అంగీకారం తెలిపారు.
అయితే టీజీఎండీసి ద్వారా ఆయా భూములలో ఉన్న ఇసుకను తరలించేందుకు ఎన్ని వాహనాలు అవసరమవుతాయని, ఎన్ని రోజుల సమయం పడుతుందని అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక తీసుకొని తరలించే ప్రాంతాలలో సీసీ కెమెరాలు, వాహనాలకు జిపిఎస్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.
అయితే రెవిన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీ కార్యదర్శులతో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేసి ఇసుక తరలింపు పై పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో రామచందర్ నాయక్, డి.ఎస్.పి. నల్లపు లింగయ్య, భూగర్భ జల వనరుల శాఖ అధికారిని రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, ఆర్టీవో మేఘా గాంధీ, నీటిపారుదల శాఖ జిల్లా అధికారి బాలరాజ్, డి ఈ ఈ సురేష్, టీజీఎండిసి అధికారి రంగారెడ్డి, మక్తల్, మాగనూరు తహాసిల్దార్లు, ఎస్.ఐ. లు, కలెక్టరేట్ లోని సంబంధిత సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ.3 లక్షల లోన్.. రూ.50 వేల ఉచిత ఇన్సూరెన్స్..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రత్యేక యాప్.. ఆన్ లైన్ లో ధరఖాస్తులు..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మరో కీలక నిర్ణయం.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : నిలకడగా పసిడి ధర.. ఈరోజు తులం బంగారం ఎంతో తెలుసా..!
-
New Year : న్యూ ఇయర్ బంపర్ ఆఫర్లు.. కిలో కొంటే.. అర కిలో ఫ్రీ..!









