Sand : అభివృద్ధి పనుల పేరిట అనుమతులు.. జోరుగా ఇసుక రవాణా..!

Sand : అభివృద్ధి పనుల పేరిట అనుమతులు.. జోరుగా ఇసుక రవాణా..!
మన సాక్షి:
ఇసుక అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. అధికారులతో కుమ్మకై ఇసుక రీచ్ ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిజమాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, కమ్మర్పల్లి, భీంగల్ తదితర పరిధిలోని వాగులు, నదుల ప్రాంతాల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. భీంగల్ మండలం బడా భీంగల్ లో కప్పల వాగు నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది.
కప్పల వాగుపై ఆ సారుదే పెత్తనం:
బాల్కొండ నియోజకవర్గంలో ఆ నేతదే అక్కడ పెత్తనం. నియోజకవర్గంలో ఆయన మాటే శాసనం. ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరగాలి. అలా జరుగలేదో.. ఇక ఆయన పవర్ ఏంటో రుచి చూపిస్తారు. దీంతో పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ శాఖతో పాటు ఇతర ఏ అధికారులైనా చూసీ చూడనట్లు వ్యవహ రించాల్సిందే.
అభివృద్ధి పనుల పేరిట:
అభివృద్ధి పనుల పేరిట అనుమతులు పొందుతూ ఇసుక వ్యాపారులు భారీగా బిజినెస్ చేస్తున్నారు. ఈ విషయం అన్ని శాఖల అధికారులకు తెలిసినా అడ్డుకోలేకపోతున్నారు. ఇసుక రవాణా చేసే ఒక్కో ట్రాక్టర్ రూ. 50 వేల నుంచి రూ. 75 వేల వరకు గ్రామకమిటీలతో ఒప్పందం కుదుర్చుకుని అనధికారిక అనుమతులు పొందుతున్నారు. ట్రాక్టర్లన్నీ సిండికేటై ఈ దందాను కొనసాగిస్తున్నాయి.
కొందరే మో నామినల్ గా డీడీ లు కట్టి ఇసుకను తరలిస్తుంటే మరి కొందరు డీడీలు గీడీలు జాన్తా నై అంటూ దూకుడుగా వెళుతున్నారు. ఇసుక తరలింపుకోసం అనుమతులు తీసుకోవడానికి సిండికేట్ మధ్యవర్తి ద్వారానే అధికారులు అనుమతులు జారీ చేస్తున్నారు.
వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో:
వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడా చూసినా ఇసుక ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి. ఎక్కడా పడితే అక్కడ గుట్టల్లా ఇసుక డంపులు దర్శన మిస్తున్నాయి. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను కూడా డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
Reporting : Pranay, Bhemgal
MOST READ :
-
Mahila : మహిళా రైతులకు 50% రాయితీ పై వ్యవసాయ పనిముట్లు..!
-
PDS : పిడిఎస్ దందా ముఠా అరెస్ట్.. భారీగా పిడిఎఫ్ బియ్యం పట్టివేత..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!
-
Heart Attack : మీరు రోజూ ఇలా చేయకుంటే.. హార్ట్ ఎటాకే..!
-
Good News : రూ.1500 చెల్లిస్తే లక్ష రూపాయలు.. రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఎప్పుడో..!









