Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుటెక్నాలజీతెలంగాణహైదరాబాద్

Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!

Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్జక్షన్ మాత్రమే కాకుండా వినియోగదారులకు లెండింగ్, ఇన్సూరెన్స్, పేమెంట్ గేట్ వే బిజినెస్ లలోకి ఎంట్రీ ఇచ్చి అనేక సేవలు అందిస్తుంది. ఆ విధంగానే ప్రస్తుతం నూతనంగా వినియోగదారులకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి షేర్ మార్కెట్ యాప్ ను తీసుకొచ్చింది.

 

ఫోన్ పే కస్టమర్లకు తాజాగా శుభవార్త తెలియజేసింది . ఫోన్ పే షేర్ మార్కెట్ అనే కొత్త సర్వీసులను లాంచ్ చేసింది. దీంతో స్టాక్ బ్రోకింగ్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. షేర్ మార్కెట్ పేరుతో ఈ యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చును. దాంతోపాటు ట్రేడింగ్ కూడా చేయవచ్చును. మ్యూచువల్ ఫండ్స్, ఈటిఎఫ్ (ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ ) కూడా ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చును. ఫోన్ పే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చును.

 

ఇన్సూరెన్స్ , లెండింగ్, పేమెంట్ గేటు బిజినెస్ లలో ఇటీవల కాలంలోనే ఫోన్ పే కొత్త సర్వీసులను అందజేసింది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. ప్రస్తుతం స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లో కూడా వచ్చేసింది . ఫోన్ పే వెల్త్ ద్వారా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఫోన్ పే ఫౌండర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమీర్ నిమ్ తెలియజేశారు.

 

ALSO READ : 

  1. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
  2. Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
  3. Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
  4. NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
  5. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !

 

ఫోన్ పే 100 మిలియన్ డాలర్లను సమీకరించిన తర్వాత స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లో జెరోధా , గ్రా, అప్ స్టాక్స్ లాంటి కంపెనీలవే హవా కొనసాగుతుంది. ఇకపై ఫోన్ పే కూడా ఆ వ్యాపారంలోకి వచ్చింది. ఇకపై ఫోన్ పే త్వరలోనే స్టాక్ మార్కెట్లోకి కూడా ఎంట్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చును.

 

వాల్ మార్ట్ కు చెందిన ఫిన్టెక్ సంస్థ ఫోన్ పే షేర్ మార్కెటింగ్ పేరుతో వినియోగదారులకు శుభవార్త తెలియజేసినట్టుగానే మరి కొద్ది రోజుల్లో ఈ యాప్ ద్వారా వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు