Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
హైదరాబాద్ మన సాక్షి :
రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ప్రకటించింది.
07637 రైలు తిరుపతి నుంచి సాయి నగర్ షిరిడి మధ్యలో ప్రతి ఆదివారం అందుబాటులో ఉండనున్నది. సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు దీన్ని పొడిగించారు. 07638 సాయి నగర్ షిరిడి నుంచి తిరుపతి మధ్య ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పొడిగించారు.
07195 కాజీపేట నుంచి దాదర్ మధ్య ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది . సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 27 వరకు పొడిగించారు. 07196 దాదర్ నుంచి కాజీపేట మధ్య ప్రతి గురువారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 28 వరకు పొడిగించారు.
07197 కాజీపేట నుంచి దాదర్ మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. 07198 దాదర్ నుంచి కాజీపేట మధ్యన ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ మూడు నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పొడిగించారు.
07051 హైదరాబాదు నుంచి రక్సల్ ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. 07052 రక్సల్ నుంచి హైదరాబాద్ మధ్యన ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు పొడిగించారు.
07419 సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. 07420 దానాపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్యన ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పొడిగించారు.
ALSO READ :
- Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
- How to Make Sweet Curd : ఇలా చేస్తే పెరుగు తియ్యగా, గడ్డలా తోడుకుంటుంది..!
- కుల్కచర్ల లో నకిలీ అల్లం , వెల్లుల్లి పేస్ట్ పట్టివేత..!
- దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
- TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
07007 సికింద్రాబాద్ నుంచి మధ్య ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు పొడిగించారు. 07008 రక్సల్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు.
07115 హైదరాబాద్ నుంచి జైపూర్ మధ్య ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 29 వరకు పొడిగించారు. 07116 జైపూర్ నుంచి హైదరాబాద్ మధ్య ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు పొడిగించారు.
07053 కాచిగూడ నుంచి బికనీర్ మధ్యన ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది . సెప్టెంబర్ రెండో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.










