TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
హైదరాబాద్, మనసాక్షి :
మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాదులో మహిళా ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
మహిళా ప్రయాణికులకు కోఠి – కొండాపూర్ మార్గంలో లేడీస్ స్పెషల్ బస్సును ఏర్పాటు చేసింది. 127 K నెంబర్ ప్రత్యేక బస్సు ఈనెల 21వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నది. కోఠి నుంచి కొండాపూర్ మార్గంలో ఈ బస్సు ఉదయం సాయంత్రం వేళల్లో నడపనున్నారు.
ప్రతిరోజు ఉదయం 8:50 గంటలకు కోఠి నుంచి బయలుదేరుతుంది. లకిడికాపూల్, మాసబ్ ట్యాంక్ , ఎమ్మెల్యే కాలనీ, ఉషా కిరణ్, గుట్టల బేగంపేట, శిల్పారామం, కొత్తగూడ ఎక్స్ రోడ్డు మీదుగా కొండాపూర్ వరకు వెళుతుంది. తిరిగి సాయంత్రం 5:45 గంటలకు కొండాపూర్ లో బయలుదేరుతుంది. అదే మార్గంలో కోఠికి వస్తుంది. మహిళా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ సంస్థ కోరుతుంది.
MOST READ :
- TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
- TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
- Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
- Groups : గ్రూప్2 పరీక్షలు వాయిదా వేయాలి..!