TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!

తెలంగాణ ఆర్టీసీ ఆధునిక టెక్నాలజీతో ప్రజలకు మరింత చేరువవుతుంది. సాంకేతికను అందిపుచ్చుకొని ప్రజలకు చేరువయ్యే దిశలో ప్రయాణం చేస్తుంది.

TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ ఆర్టీసీ ఆధునిక టెక్నాలజీతో ప్రజలకు మరింత చేరువవుతుంది. సాంకేతికను అందిపుచ్చుకొని ప్రజలకు చేరువయ్యే దిశలో ప్రయాణం చేస్తుంది. ప్రయాణికులకు వారు ప్రయాణించే బస్సు ఎక్కడుందో..? తెలుసుకునే విధంగా బస్ ట్రాకింగ్ యాప్ ను ప్రారంభించింది. బస్సు ట్రాకింగ్ యాప్ కు “గమ్యం” గా నామకరణం చేశారు.

 

ఈ యాప్ ను స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ప్రయాణికులు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో..? తెలుసుకోవడం చాలా ఈజీగా మారనున్నది. ఇకపై బస్సు ఎక్కడుందో..? ఎప్పుడు వస్తుందో..? అని వేచి చూడాల్సిన అవసరం కూడా లేకుండా పోతుంది. ఆధునిక టెక్నాలజీ ఫీచర్ ఉన్న గమ్యం యాప్ ద్వారా ఆర్టీసీ బస్సు మన వద్దకు రావడానికి ఎంత సమయం పడుతుందో..? తెలుసుకునే అవకాశం ఉంది.

 

తెలంగాణ ఆర్టీసీకి చెందిన 4170 బస్సులకు ఈ ట్రాకింగ్ సదుపాయం కల్పించారు. హైదరాబాద్ లోని పుష్పక్ ఎయిర్ పోర్ట్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అదేవిధంగా జిల్లాలో పల్లె వెలుగు మినహా అన్ని బస్సులకు ఈ సదుపాయం కల్పించబడింది. అక్టోబర్ నెల నుంచి మిగతా సర్వీసులన్నింటికీ కూడా బస్ ట్రాకింగ్ సదుపాయాన్ని అనుసంధానం చేయబోతున్నారు.

 

గమ్యం యాప్ ద్వారా ఏ ఏ బస్సులు ఏ ఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో..? కూడా తెలుసుకోవచ్చును. డ్రైవర్ , కండక్టర్ వివరాలు కూడా అందులో కనిపిస్తాయి. హైదరాబాద్ లో సిటీ బస్సులకు రూట్ నెంబర్ ఎంటర్ చేసి బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చును. దూరప్రాంత సర్వీసులకు మాత్రం రిజర్వేషన్ నెంబర్ ఆధారంగా బస్సులను ట్రాకింగ్ చేసే అవకాశం ఉంది.

 

MOST READ : 

  1. TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. టి – 24 టికెట్..!
  2. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
  3. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
  4. మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!

గమ్యం యాప్ ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి :

“TSRTC Gamyam” పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్ లోడ్ ఉచితంగా అవుతుంది. డౌన్ లోడ్ చేసుకోవడానికి ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు ఇంగ్లీషు భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఇన్స్ స్టాల్ చేసుకున్నవారు అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.

 

మహిళల భద్రతకు ఫ్లాగ్ ఏ బస్సు ఫీచర్ :

గమ్యం యాప్ లో మహిళా ప్రయాణికుల భద్రతకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళల సౌకర్యార్థం గమ్యం యాప్ లో “ప్లాగ్ ఏ బస్ ” అనే ఫీచర్ అందుబాటులో ఉంది. రాత్రి వేళల్లో బస్టాప్ లు లేని ప్రాంతాల్లో ఈ మహిళా ఫీచర్ మహిళా ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫీచర్ బస్సు అందుబాటులో ఉంటుంది. ఆ యాప్ లో వివరాలు నమోదు చేయగానే స్మార్ట్ ఫోన్లో స్క్రీన్ పై ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ ప్రత్యక్షమవుతుంది. ఆ లైట్ డ్రైవర్ వైపునకు చూపించగానే సంబంధిత డ్రైవర్ బస్సును ఆపుతారు. దాంతో మహిళలు క్షేమంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.

 

అదేవిధంగా అత్యవసరమైన పరిస్థితులలో ఎస్ ఓ ఎస్ బటన్ ద్వారా టిఎస్ఆర్టిసి కాల్ సెంటర్ కు ఫోన్ చేసే అవకాశం ఉంది. డయల్ 100, 108 కి కూడా ఈ యాప్ ను అనుసంధానం చేశారు . ఈ సదుపాయంతో యాప్ నుంచే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వవచ్చును. బస్సు బ్రేక్ డౌన్ , వైద్య సహాయం , రోడ్డు ప్రమాదం ఇంకా ఇతర వివరాలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిపోర్ట్ చేయొచ్చును. వాటి ఆధారంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

 

ALSO READ : 

  1. Kodada : బీసీలకు రూ . లక్ష సహాయం షురూ..!
  2. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  3. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
  4. Runa Mafi : రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది..? తెలుసుకుందాం..!