Kodada : బీసీలకు రూ . లక్ష సహాయం షురూ..!

Kodada : బీసీలకు రూ . లక్ష సహాయం షురూ..!

కోదాడ, మనసాక్షి

ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో కులవృత్తులు కనుమరుగయ్యాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బీసీల్లోని కులవృత్తులను నమ్ముకొని బతుకుతున్న వారికి రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

 

సూర్యాపేట జిల్లా కోదాడ లోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి వెనుకబడిన కులాలు, కులవృత్తులకు రూ.లక్ష పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 294 మంది లబ్ధిదారులకు లక్ష చొప్పున రూ 2.94 కోట్ల చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా కూడా బీసీల కోసం ఇలాంటి పథకం లేదన్నారు.

 

సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి వారు ఆర్థికంగా ఎదుగాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనంది స్తున్నారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో 300 మందికి లక్ష రూపాయాల చొప్పున సహాయం అందజేస్తామని అన్నారు.

 

ALSO READ :

  1. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
  2. Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
  3. ఫోన్ పే చేస్తామని మోసం..!
  4. Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!

 

ఇప్పటికే గొల్ల, కురుమలు, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటునందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలు, చేతివృత్తుల వారి అభ్యున్నతికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. బీసీ కులాల్లోని నాయీబ్రాహ్మణులు, రజక, సగర, కుమ్మరి, అవుసుల, కంసాలి, వడ్రంగి, వడ్డెర, కమ్మరి, కంచరి, మేదర, కృష్ణ బలిజ పూస, మేర, ఆరె కటిక, ఎంబీసీ కులాలకు చెందినవారికి సర్కారు సాయమందించనున్నట్లు పేర్కొన్నారు.

 

గత పాలకుల హయాంలో వెనుకబాటు తనానికి గురైన కులవృత్తులకు ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవం పోస్తున్నారని కొనియాడారు. 9 మంది అక్కాచెల్లెళ్ల తోబుట్టువు గా ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంగా ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని నమ్మే నాయకుడు కేసీఆర్ అన్నారు.

 

అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా కులవృత్తుల సంక్షేమానికి లక్షరూపాయలు అందించి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌దేఆన్నారు . సమాజం చివరి అంచులో ఉన్న వారికి ప్రభుత్వ లక్ష్యాలను చేరాలని ఉద్దేశంతోనే లక్ష సహాయానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.