ఫోన్ పే చేస్తామని మోసం..!

సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు గ్రామాలలో సైతం అవగాహన కల్పిస్తున్నారు. అయినా కూడా కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు.

ఫోన్ పే చేస్తామని మోసం..!

మనసాక్షి:

అవకాశం వస్తే చాలు సైబర్ మోసాలకు పాల్పడడానికి ఎంతటి వారైనా వెనకాడడం లేదు. పోలీసు వారు గ్రామాలలో సైతం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా కూడా కొంతమంది చేతిలో మోసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫోన్ పే స్క్రీన్ షాట్ పిక్చర్స్ చూపించి వ్యాపారులను కొంతమంది మోసం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

శనివారం ఒక గంట లోనే పోకిరీలు మూడు షాపు యజమానులను బురిడీ కొట్టించి మోసానికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులు ఫుట్ వేర్ షాపుల్లో బూట్లు కొనుగోలు చేశారు. అనంతరం కొనుగోలు చేసిన వాటికి డబ్బులు ఫోన్ పే నెంబర్ కు వేస్తామన్నారు. దాంతో షాప్ యజమాని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు వేయాలని కోరాడు.

 

ALSO READ : 

  1. Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!
  2. మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!
  3. Telangana : తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయాలు..!
  4. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  5. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!

 

దాంతో తమ మొబైల్ లో కెమెరా పనిచేయడం లేదని మీ మొబైల్ నెంబర్ చెప్పాలని అడిగారు. కాగా షాపు ఓనర్ మొబైల్ నెంబర్ చెప్పడంతో తీసుకున్నారు. హడావిడిలో ఉన్న షాప్ యజమాని పోకిరిలు తమ మొబైల్ లో ఉన్న పాత స్క్రీన్ షాట్ పిక్చర్ చూపించి బూట్లతో ఉడాయించారు. తీరా చూస్తే ఆ ఫోన్ పే నెంబర్ కు డబ్బులు రాలేదు.

 

అదేవిధంగా మరో రెండు ఫోటోలు షాపుల్లో కూడా మోసానికి పాల్పడ్డారు. చివరికి దొరకడంతో ఆ షాపు యజమానులు పోకిరిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా పోకిరిల పట్ల సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.