Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!

Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
హైదరాబాద్ , మనసాక్షి :
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి ప్రస్తుతం నిత్య కృత్యమైంది. ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవడానికి బ్యాక్ కేస్ , స్క్రీన్ గార్డ్ ఖరీదైనవి వాడుతుంటారు . కానీ చార్జింగ్ పెట్టే సమయంలో హడావిడిగా ఉంటూ.. ఇష్టం వచ్చినట్లు ఛార్జింగ్ పెడుతుంటారు. చార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ పట్ల పొరపాట్లు చేస్తే పేలిపోతుంది. అవేంటో తెలుసుకుందాం..
స్మార్ట్ ఫోన్ కు బ్యాటరీ చాలా ముఖ్యమైన భాగం. చార్జింగ్ లో ఫోన్ పెట్టేటప్పుడు పొరపాటు చేస్తే పేలిపోవడం ఖాయం. ఫోన్ లో బ్యాటరీ వీక్ అయిపోయినా.. పాడైపోయినా.. మళ్లీ బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లో యూనివర్సల్ ఛార్జింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుంది.
MOST READ :
- Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
- Admin Review : కొత్త టూల్స్.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
- UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
- PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!
- WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
మీరు ఫోన్ కు ఛార్జింగ్ పెట్టే సమయంలో ఒరిజినల్ చార్జర్ తో చార్జింగ్ పెట్టుకోవాలి. తప్పు చార్జర్ తో ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ తింటుంది. సాధారణ చార్జర్ తో ఫోన్ చార్జింగ్ పెడితే ఫోన్ బ్యాటరీ పాడవుతుంది. కేబుల్ కూడా ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో వచ్చే దానినే ఉపయోగించాలి.
ఫోన్ కవర్ వేసి వేరు చేసి చార్జింగ్ పెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్ చార్జింగ్ పెట్టేటప్పుడు వేడెక్కుతుంది. ప్రొటెక్షన్ కవర్ కారణంగా వేడి బయటకు రాకుండా ఉంటుంది. దాంతో ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ కు ఫాస్ట్ చార్జర్ ని ఎంపిక చేసుకోవడం కూడా పొరపాటే. ఈ పొరపాటును ఎప్పుడు చేయొద్దు.
రాత్రంతా చార్జింగ్ లో పెట్టి ఫోన్ ని వదిలేస్తే కూడా బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా పేలిపోయే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తలు పాటిస్తూ స్మార్ట్ ఫోన్ వాడితే ఎక్కువ కాలం మన్నిక తో పాటు పేలిపోకుండా ఉంటుంది.