UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!

దేశవ్యాప్తంగా 20 నకిలీ యూనివర్సిటీల జాబితాను UGC ప్రకటించింది. వాటిలో ఏపీలో రెండు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి.

UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

దేశవ్యాప్తంగా నకిలీ యూనివర్సిటీలు 20 ఉన్నట్లుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది . నకిలీ యూనివర్సిటీలు ఇచ్చిన డిగ్రీ సర్టిఫికెట్లు కూడా చల్లవని తేల్చి చెప్పింది. అలాంటి యూనివర్సిటీలు దేశంలో ఢిల్లీలోనే అత్యధికంగా ఉన్నాయి.

 

ఢిల్లీలో ఎనిమిది, ఉత్తరప్రదేశ్ లో 4, ఆంధ్ర ప్రదేశ్ , బెంగాల్ లలో రెండు చొప్పున, మిగతా రాష్ట్రాలలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు యు జి సి గుర్తించినట్లు తెలియజేసింది. ఫేక్ యూనివర్సిటీలుగా గుర్తించిన ఆ 20 యూనివర్సిటీలలో జారీ చేసిన డిగ్రీ పట్టాలు కూడా చల్లని తేల్చి చెప్పింది.

 

యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు ప్రధానం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ తెలిపింది. అలాంటి విశ్వవిద్యాలయాలు అందజేసే డిగ్రీలు ఉన్నత విద్య , ఉద్యోగాల కోసం గుర్తించబోమని అవి చెల్లుబాటు కావాలని తేల్చి చెప్పింది. ఆ ఫేక్ యూనివర్సిటీలకు డిగ్రీలు ఇచ్చే అధికారం లేదని UGC కార్యదర్శి మనీష్ జోషి తెలియజేశారు. ఫేక్ యూనివర్సిటీలో పూర్తి వివరాలతో కూడిన జాబితా https://www.ugc.gov.in తెలుసుకోవచ్చును.

 

ఫేక్ యూనివర్సిటీల వివరాలు :

ఢిల్లీలో 8 :

♦️ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్

♦️కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్
దర్యాగంజ్

♦️యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ

♦️ఒకేషనల్ యూనివర్సిటీ

♦️ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్

♦️విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్

♦️ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ

♦️ ఏ డి ఆర్ సెంట్రల్ జ్యారడికల్ యూనివర్సిటీ

 

ఉత్తరప్రదేశ్ లో (4) :

♦️గాంధీ హిందీ విద్యాపీట్

♦️నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి

♦️నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ)

♦️ భారతీయ శిక్ష పరిషత్

 

ALSO READ :

  1. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!
  2. WhatsApp : వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. అదిరిపోయే ఫీచర్ మరొకటి..!
  3. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
  4. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!
  5. Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!

 

పశ్చిమ బెంగాల్ లో (రెండు )

♦️ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్

♦️ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్

♦️ బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (కర్ణాటక )

♦️సెయింట్ జాన్స్ యూనివర్సిటీ (కేరళ)

♦️ రాజా అరబిక్ యూనివర్సిటీ (మహారాష్ట్ర)

♦️శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (పుదుచ్చేరి)

♦️ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా (విశాఖ)

♦️న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ (గుంటూరు)