Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Groups : గ్రూప్2 పరీక్షలు వాయిదా వేయాలి..!

Groups : గ్రూప్2 పరీక్షలు వాయిదా వేయాలి..!

మిర్యాలగూడ, మనసాక్షి

భారతీయ జనతా యువమోర్చా (బిజేవైఎం) ఆధ్వర్యంలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో డి ఏ ఓ రాధకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిల్లంచర్ల అభి, బిజేవైఎం మిర్యాలగూడ అసెంబ్లీ కన్వీనర్ పెదమాం భరత్ మాట్లాడుతూ..

 

ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది అభ్యర్థులకు ఒకే నెలలో జేఎల్, గురుకుల తదితర పరీక్షలు ఉండటం, అన్ని పరీక్షలు నెలన్నర సమయంలో నిర్వహించడం వల్ల అభ్యర్థులు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. అంతేగాక గ్రూప్ 2 కొత్త సిలబస్ ను చేర్చడంతో అభ్యర్థుల ప్రిపరేషన్ కు సమయం సరిపోదు. గతంలో పేపర్ లీకేజీ కారణంగా రెండు, మూడు నెలలు అభ్యర్థులందరూ మానసిక ఒత్తిడికిలోనై చదువుకు దూరమయ్యారు.

 

ALSO READ : 

  1. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
  2. మిర్యాలగూడ : విద్యుత్ సమస్యలు ఉంటే, ఫోన్ చేస్తే పరిష్కారం.. ఇవిగో ఫోన్ నెంబర్స్..!
  3. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  4. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
  5. Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!

 

టి ఎస్ పి ఎస్ సి బోర్డ్ నోటిఫికేషన్లు, పరీక్షల,నియమాలను తప్పుల తడక మార్చి ప్రతిసారి నిరుద్యోగుల, అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, లక్షలాదిమంది నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్2 పరీక్షను 3 నెలల సమయం ఇచ్చి తరువాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, వాయిదా నిర్ణయం ప్రకటించాలని కోరారు. లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అభ్యర్థులతో కోసం భారీ ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమని ప్రకటించారు.

 

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్ నాయక్, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటరెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిత బిజెపి ఫ్లోర్ లీడర్ చిలుకూరి శ్యామ్ రమాదేవి గారు, శేఖర్, బిజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి మేడి నవీన్ పట్టణ ఉపాధ్యక్షులు అశోక్, యువమోర్చా నాయకులు నరేష్, రమేష్ నాయక్,శివ, అజయ్, శంకర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు