దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!

దాడి చేసిన 9మందిని రిమాండ్ -ఎస్ఐ గంగారాజు

దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!

దాడి చేసిన 9మందిని రిమాండ్ -ఎస్ఐ గంగారాజు

దుబ్బాక, మనసాక్షి :

దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో వ్యక్తి పై దాడి చేసిన తొమ్మిది మంది వ్యక్తులపై హత్యాయత్నం నేరం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ…

 

MOST READ : 

  1. సూర్యాపేట : జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత..!
  2. Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!
  3. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
  4. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  5. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!

 

దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన నరసింహులు అనే వ్యక్తి మంత్రాలు చేస్తుండనే అనుమానంతో ఈ నెల 17న మధ్యాహ్నం సమయంలో మాట్లాడుదాము అని పిలిచి అదే గ్రామానికి చెందిన 9 మంది వ్యక్తులైన నర్సగళ్ళ మహిపాల్, నరస గల్ల మైసయ్య, నర్సగళ్ళ ఎల్లం, నరస గల భూదయ్య 5. జోగు పోచయ్య, మళ్లీ బాబు, ఏర్పుల శ్యామ్, మళ్లీ స్వామి, ఎర్పుల పోచయ్య అందరి గ్రామం హబ్సిపూర్ అనే వ్యక్తులు మిరుదొడ్డి నర్సింలు, గ్రామం అనే వ్యక్తి పై మంత్రాలు చేస్తున్నాడని నెపంతో కట్టెలు రాళ్ళతో దాడి చేసి హత్యాయత్నం చేశారు.

 

పై ఘటనపై నరసయ్య కొడుకు మిద్దెటి పరశురాములు ఇచ్చిన దరఖాస్తు పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నేరస్తులైనటువంటి పైన 9 మందిని 19న శనివారం అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచి మెజిస్ట్రేట్ ఉత్తర్వులు మేరకు కరీంనగర్ సెంట్రల్ జైలుకు పంపడం జరిగిందన్నారు.