Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!

Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
హైదరాబాద్, మనసాక్షి :
సైబర్ నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాలు మరింతగా పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) వినియోగిస్తూ వికృత చేష్టలకు , సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.
అసలుకు, నకిలీకి తేడా లేకుండా ఫోటోలు, వీడియోలు, మాటలు కూడా క్షణాల్లో మార్చేస్తున్నారు. ఓ మహిళ నిండుగా చీర కట్టుకున్న వీడియో, ఫోటోలు దొరికినా కూడా క్షణాల్లోనే నగ్న వీడియో గా మార్చేస్తున్నారు. ఈ తరహా మోసాలను “డీప్ ఫేక్” గా చెప్పవచ్చును.
డీప్ ఫేక్ అంటే :
డీప్ ఫేక్ అంటే అసలుని తమకు నచ్చినట్లుగా నకిలీగా మార్చడమే డీప్ ఫేక్. ఇప్పుడు ఈ పరిజ్ఞానం మన ఫోన్లోకి కూడా వచ్చేసింది. చిన్న వయసు ఫోటో పెడితే వృద్ధాప్యంలో ఎలా ఉంటారో మార్చి చూపే యాప్ లు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చాయి. దీనికి టెక్నాలజీని ఉపయోగించి నేరగాళ్లు నేరాలకు ఉపయోగిస్తున్నారు. పలువురి ప్రసంగాలను కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు.
డీప్ ఫేక్ క్షణాల్లోనే :
డీ ఫేక్ మాయాజాలం చేసే సైబర్ నేరగాళ్లు కొన్ని క్షణాల్లోనే ఫోటోలు, వీడియోలు మాటలు మార్చేస్తున్నారు. డార్క్ వెబ్ లో ఇలాంటి వెబ్ సైట్లు అనేకం ఉంటాయి. వీటిని డౌన్ లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య లక్షల సంఖ్యలో ఉంటుందని ఇటీవల దర్యాప్తు అధికారులు కూడా గుర్తించారు.
వీడియోని అందులో అప్ లోడ్ చేయగానే దాన్ని అనుకున్న విధంగా మార్చేస్తుంది. మాటలు కూడా ఏమార్చి ఇష్టం వచ్చిన రీతిలో పదాలను మాట్లాడించవచ్చు. డీప్ ఫేక్ తో ఆర్థికపరమైన మోసాలకు పాల్పడడమే కాకుండా వేధింపులకు సైతం పాల్పడుతున్నారు.
జాగ్రత్త తప్పదు :
డి ఫేక్ పట్ల బాలికలు, యువతులు, మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి . వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో పెట్టే వీడియోలు, ఫోటోలు మార్పునకు గురయ్యే అవకాశం ఉంది. ఫోటోలే కాకుండా స్వరం కూడా మార్పునకు గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
MOST READ :
- TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
- TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. టి – 24 టికెట్..!
- TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
- హైదరాబాదులో దారుణం.. మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం..!
మహిళలు సోషల్ మీడియాకు సంబంధించిన ప్రొఫైల్స్ ను తప్పనిసరిగా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నప్పటికీ కూడా హాకర్స్ వాటిని హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి వారికి చిక్కితే ఆ తర్వాత ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఫోటోలు , వీడియోలు గొంతు మార్చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. వాటి వల్ల సోషల్ మీడియాలో చలామణి అయిన తర్వాత అలాంటి వాటిని చూసి తట్టుకోవడం, తలెత్తుకోవడం చాలా కష్టంగా మారినది.
అందుకోసం మహిళలు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని.. ఇంకేదైనా కారణం చెప్పి డబ్బులు పంపించాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దు. మీ కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గాని, మిత్రులు గానీ, వారి స్వరంతోనే అదే రూపంలో ఉండే వీడియో ద్వారా మిమ్ములను డబ్బులు అడిగే అవకాశం ఉంది.
అలాంటి వీడియో మీకు గాని స్వరం గాని వస్తే మీ దగ్గర ఉన్న అసలు ఫోన్ నెంబర్లకు కాల్ చేసి వెంటనే తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులను, మిత్రులు, బంధువులను కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.
ALSO READ :
- వేములపల్లి : రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
- Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
- Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
- వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
- WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!