హైదరాబాదులో దారుణం.. మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం..!

హైదరాబాదులో దారుణం.. మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం..!
హైదరాబాద్, మనసాక్షి :
హైదరాబాదులోని కొంపల్లిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఆశ చూపి మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం చేసిన సంఘటన చోటు చేసుకుంది. పేట్ బషీర్ బాద్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శివకుమార్ ( 45 ) కుమారుడు శ్యామల్ (19 ) ఇద్దరు వ్యక్తులు కొంపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరు నివాసం ఉంటున్న పక్కనే ఓ బాలిక ఉంటుంది. ఆమెకు సెల్ ఫోన్ ఇస్తామని ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంతరం బాలికపై అత్యాచారం చేశారు . ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు.
ALSO READ :
- Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
- Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!
- Srisailam : శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీరు..!
- వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
కాగా గత రెండు, మూడు రోజుల నుంచి బాలిక ప్రవర్తనలో తేడా వచ్చింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని వివరించింది. దాంతో బాధితురాలి తల్లి పేట్ బషీర్ బాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిందితులైన తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలికను ఆసుపత్రికి తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు, పలువురు డిమాండ్ చేశారు.