సూర్యాపేట : జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత..!

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన సంఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

సూర్యాపేట : జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత..!

సూర్యాపేట , మన సాక్షి :

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జిల్లా కలెక్టర్ ను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేసిన సంఘటన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం .. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి 100 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయాల సమీకరణ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

 

అదేవిధంగా 150 కోట్ల రూపాయలతో నిర్మించిన మెడికల్ కళాశాలను, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ప్రారంభించిన సందర్భంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు ను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ…

 

MOST READ :

  1. Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!
  2. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  3. హైదరాబాదులో దారుణం.. మైనర్ బాలికపై తండ్రి కొడుకులు అత్యాచారం..!
  4. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  5. Cooking : హోటల్లో వంట మాస్టర్ కానీ.. స్నేహితులతో కలిసి..!

 

సూర్యాపేట చక్కగా అభివృద్ధి చెందిందని, 100 కోట్ల తో పరిపాలన భవనాలు ప్రారంభించుకున్నామన్నారు.
ప్రపంచం లోనే మానవభివృద్ధిలో రాష్ట్రం గొప్ప స్థానం లో ఉండడం గర్వకారణమని, తలసరి ఆదాయం లో, విద్యుత్ వినియోగం లో అగ్రస్థానమన్నారు. ఇంత అద్భుత కలెక్టరేట్ లు, పోలీస్ భవనాలు ఎక్కడా లేవని,కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ లు కూడా ఇంతలా లేవన్నారు.

 

ఇప్పటికే excellence దశకు చేరుకున్నాం. ఇంతటితో ఆగిపోవద్దు. నెక్స్ట్ దశ ఎక్సెలెన్స్ కోసం ప్రయత్నం చేయాలన్నారు. సమాజంలో ఆర్ధిక అసమానతలు, సాంఘిక అసమానతలు పోవాలని, ప్రజలంతా సంతోషం గా జీవించే స్థితి రావాలన్నారు. ఆకలి లేని రోజులు రాష్ట్రంలో తెచ్చుకున్నామని, ఇందులో దుషర్ల సత్యనారాయణ లాంటి ఎందరో పోరాటం ఉన్నదన్నారు.

 

అందరి భాగస్వామ్యం తోనే ఇంతటి ప్రగతి సాధ్యం అయిందని, ఇవ్వాళా సూర్యాపేట లో పండగ వాతావరణం కనిపిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నుజిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు శాలువాతో సత్కరించి, మెమెంటో ను అందించారు. సర్వమత ప్రార్థనల్లో సీఎం కేసీఆర్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

  1. భారతదేశం గర్వించదగ్గ ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్
  2. మిర్యాలగూడ : ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి
  3. BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి