BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి

BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి..! 

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆయా పార్టీలలో టికెట్ల ఆశావాహులు పెరుగుతున్నారు. అధికార బి ఆర్ ఎస్ లో మరో రెండు రోజుల్లో టికెట్లు మొదటి జాబితా ప్రకటిస్తారని ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

 

సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లతో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా కొంతమందికి టికెట్లు ఖరారు అయ్యాయని, మరి కొంతమందిని ప్రగతి భవన్ లో బుజ్జగింపులు చేస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.

 

టికెట్లు ఆశించిన వాళ్లలో సిట్టింగులకు కొంతమందికి ఈసారి టికెట్లు రావని ప్రచారం సాగుతుండటంతో రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి.

 

హనుమకొండలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ విషయంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాజయ్య అనుచరులు భగ్గుమన్నారు. కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాజయ్యకు మద్దతుగా ఆయన వర్గీయులు భారీ ర్యాలీ నిర్వహించార శ్రీహరి వద్దు – రాజయ్య ముద్దు అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు.

 

అదే విధంగా జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ వస్తుందని ఊహగానాల వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి అనుచరులు ముదిరెడ్డికి అనుకూలంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముత్తిరెడ్డి ముద్దు – పల్లా వద్దు అంటూ అనుచరులు ర్యాలీలో నిర్వహించారు.

 


ఆందోళనలు షురూ :

అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల ప్రకటన రాకముందే ఆ పార్టీలో ఆందోళనలు షురూ అయ్యాయి . సర్వేల ఆధారంగా ఆ పార్టీ అధినేత కెసిఆర్ టికెట్లు ప్రకటిస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. సర్వేల ప్రకారం చూస్తే సెట్టింగ్ లకు కొంతమందికి టికెట్లు రావని చెప్పవచ్చును. రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న సిట్టింగ్ లు ఈసారి కూడా టికెట్లు తమకే వస్తాయని ఆశావాహంతో ఉన్నారు. తమకు టికెట్ రాదని తెలియడంతో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. వర్గ విభేదాలు ఆ పార్టీలో నియోజకవర్గాల వారీగా బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

ALSO READ :

Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!

2. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!

3. నారాయణపేట : పనులలో జాప్యం చేసిన అధికారుల పై జిల్లా అదనపు కలెక్టర్ ఆగ్రహం

 

జాబితా ప్రకటిస్తే మరికొన్నిచోట్ల ఆందోళనలు:

టిఆర్ఎస్ మొదటి జాబితా ప్రకటిస్తే రాష్ట్రంలో మరికొన్నిచోట్ల ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా సిట్టింగ్ లతోపాటు ఇతరులు కూడా అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారు టిఆర్ఎస్ లో ఉన్నారు. దాంతో మొదటి జాబితా ప్రకటిస్తే ఆశావాహులు ఆందోళనలు చేయడంతో పాటు వర్గ విభేదాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.

 

ఆచితూచి అడుగు వేస్తున్న కేసీఆర్ :

ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థులను ముందస్తుగానే ప్రకటించాలని భావిస్తున్న ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా మూడవ పర్యాయం అధికారం చేజెక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించడానికి ముందే ఆశావాహులతో మాట్లాడి, బుజ్జగింపులు నిర్వహించి టికెట్లు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.