నారాయణపేట : పనులలో జాప్యం చేసిన అధికారుల పై జిల్లా అదనపు కలెక్టర్ ఆగ్రహం

నారాయణపేట : పనులలో జాప్యం చేసిన అధికారుల పై జిల్లా అదనపు కలెక్టర్ ఆగ్రహం

నారాయణపేట టౌన్, మన సాక్షి:
జిల్లా కేంద్రం లో పలు అభిరూద్ది పనులను మున్సిపల్ అధికారులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ మాయాంక్ మిట్టల్ శుక్రవారం మధ్యాహ్నం పర్యవేక్షించారు. యాదగిరి రోడ్డు మార్గంలో ఎర్ర గుట్ట దగ్గర 800 గజలలో నిర్మిస్తున్న రూ. 2 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న ధోబి ఘాట్ పనులకు పరిశీలించారు.

 

నిర్ణయించిన సమయానికి పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంచేయాలని అధికారులకు ఆదేశించారు. అభిరుద్ది పనుల పై నిర్లక్షం వహించి పనులలో జాప్యం చేసిన అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం లోని దామరగిద్ద  రోడ్డు సమీపాన( 1 )  ఒక్క ఏకరం లో   స్మశాన వాటిక సుందరీకరణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ మాయాంక్ మిట్టల్ అసహనం వ్యక్తం చేశారు .

 

ALSO READ : 

  1. Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
  2. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
  3. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  4. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!

 

పనుల్లో నిర్లక్ష్యం వహించిన చో చర్యలు తప్పవని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అలాగే ఉట్కుర్ మండలం పగిడిమర్రీ రోడ్డు లో నారాయణపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ లో స్మశాన వటికలలో మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సునీత, ఆంజనేయులు, ఘనేశ్వర్ రెడ్డి, రాజు నాయక్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.