భారతదేశం గర్వించదగ్గ ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ ఛైర్మెన్ వెన్ రెడ్డి రాజు

భారతదేశం గర్వించదగ్గ ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ ఛైర్మెన్ వెన్ రెడ్డి రాజు

చౌటుప్పల్, మన సాక్షి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట జిల్లా భాను పూరిలో ఈనెల 20 ఆదివారం నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పిలుపునిచ్చారు.

 

శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం గర్వించే ఉద్యమ నాయకుడు అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎవరు ఎక్కడ చేయలేని సహాయాన్ని చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

 

రైతుల శ్రేయస్సు కోరి రైతు బాగుండాలని వారం రోజుల్లోనే రైతు రుణమాఫీ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆడపడుచులకు సైతం గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన ఏకైక సంక్షేమ పథకాలే మళ్లీ హ్యాట్రిక్ సాధిస్తాయన్నారు. అంతేకాకుండా సూర్యాపేట జిల్లా భానుపురి సభకు ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం కేసీఆర్ కి నియోజకవర్గాలలో గులాబీ స్థానాలను గెలిపించి కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు .

 

MOST READ : 

  1. BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి
  2. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  3. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  4. TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
  5. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!

 

సీఎం కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని అన్నారు. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రగతి కోసం ఒంటి చేతితో శ్రమిస్తూ, చెక్కుచెదరని గులాబీ కోటగా ఉమ్మడి జిల్లాను తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు.

 

రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్ వెలుగులు వీరజమ్మటానికి కారకులైన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ,బిజెపిలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. వీరికి గతంలో వచ్చిన స్థానాలు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు .

 

ఈ కార్యక్రమంలో జిల్లా వార్డు కౌన్సిలర్ పోరం అధ్యక్షుడు ఎండి బాబా షరీఫ్ ,వార్డ్ కౌన్సిలర్లు కొరగాని లింగస్వామి, బండమీది మల్లేష్, ఆలే నాగరాజు, నాయకులు బొడిగే బాలకృష్ణ గౌడ్, బత్తుల స్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.