మిర్యాలగూడ : ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి

చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలు పెంచాలి

మిర్యాలగూడ : ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి

చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలు పెంచాలి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

నాగార్జునసాగర్ ఎడమకాలవకు సాగునీటిని విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు.తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ఎన్ఎస్పి  కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో అధికారికి వినతిపత్రం సమర్పించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ ఆయకట్టులో సాగునీరు అందగా పంట పొలాలు ఎండుతున్నన్నాయన్నారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవకపోవడం వల్ల సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు రాలేదని దీనివల్ల సాగునీటి విడుదలపై సందిగ్ధత నెలకొందన్నారు.

 

సాగునీరు వస్తుందని ఆశతో ఆయకట్టులో రైతులు పంటలు సాగు చేసుకున్నారని ఇప్పుడు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఈ సీజన్లో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని దాని ఫలితంగా బోర్లు బావులు కింద ఉన్న పంట పొలాలు సైతం ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ప్రస్తుతం సాగర్ లో 515 అడుగుల నీటిమట్టం ఉందని గతంలో 510 అడుగులు ఉంటేనే మొదటి విడత నీటి విడుదల చేశారని, దాని ఫలితంగా భూగర్భ జలాలు పెరిగి పంట పొలాలకు ఉపయోగపడిందని చేశారు. అదే మాదిరిగా ప్రస్తుతం సాగునీటిని విడుదల చేసి ఎండుతున్న పంట పొలాలను కాపాడాలని కోరారు. ఆ నీటితో చెరువులు కుంటలు నింపినట్లైతే భూగర్భ జలాలు పెరిగి ఎండుతున్న పంట పొలాలకు జీవం పోసినట్లు అవుతుందని చెప్పారు.

 

MOST READ: 

  1. BRS : బిఆర్ఎస్ లో మొదలైన టికెట్ల లొల్లి
  2. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  3. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  4. Cooking : హోటల్లో వంట మాస్టర్ కానీ.. స్నేహితులతో కలిసి..!

 

భవిష్యత్తులో తాగునీరు సమస్య కూడా ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండుతున్న పంట పొలాలను దృష్టిలో ఉంచుకొని సాగునీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలు పెరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్,మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, రైతు సంఘం జిల్లా సహా కార్యదర్శి రాగి రెడ్డి మంగారెడ్డి,సిపిఎం జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, బావాండ్ల పాండు,పోలబోయిన వరలక్ష్మి, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధనీ,వినోద్ నాయక్,నాయకులు పగిడోజు రామ్మూర్తి, చౌగాని వెంకన్న, పాపా నాయక్, సైదా నాయక్, కోటి రెడ్డి, కోడిరెక్క మల్లయ్య, బిక్షం, సైదులు తదితరులు పాల్గొన్నారు.