Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
మనసాక్షి , వెబ్ డెస్క్:
నగదు చెల్లింపులకు ఎక్కువమంది యూపీఐ యాప్ లను వినియోగిస్తున్నారు. ప్రతి రూపాయి చెల్లింపుకు కూడా యూపీఐ (UPI) యాప్ లను ఉపయోగించే వారే పెరిగిపోయారు. కానీ ఆ యూపీఐ యాప్ లు వినియోగించేవారు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోరు. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతుంటారు. యూపీఐ యాప్ లు వినియోగించేవారు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
స్క్రీన్ లాక్ తప్పనిసరిగా ఉపయోగించాలి :
మీరు యూపీఐ యాప్ ను ఉపయోగించి చెల్లింపులు చేస్తున్నట్లయితే మీ ఫోన్ కు స్క్రీన్ లాక్ తప్పనిసరిగా ఉపయోగించాలి. మీ ఫోన్ కు స్క్రీన్ లాక్ తప్పనిసరిగా పెట్టుకోండి. అంతేకాకుండా పిన్ నెంబర్ లేదా వేలిముద్ర ద్వారా మీ యూపీఐ యాప్ ను లాక్ చేయండి.
అనుమానం వస్తే లింకుపై క్లిక్ చేయొద్దు :
సైబర్ క్రైమ్ మోసగాళ్లు వివిధ రకాల లింకులను పంపిస్తుంటారు. ఎకౌంట్లు ఖాళీ చేస్తుంటారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా లింకులు పంపిస్తే వాటిని క్లిక్ చేయవద్దు. అలాంటి లింకుల ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేయకూడదు. మోసగాళ్లు తరచుగా ఇలాంటివి ఉపయోగిస్తుంటారు. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
పిన్ నెంబర్ షేర్ చేయవద్దు :
మీ యూపీఐ పిన్ నెంబర్ ను ఎవరికి షేర్ చేయవద్దు. ఏదైనా డిజిటల్ చెల్లింపులకు యూపీఐ పిన్ చాలా ముఖ్యం . అలాంటి పరిస్థితుల్లో మీ పిన్ నెంబర్ ను ఎక్కడైనా నెంబర్ సేవ్ చేసుకోవడం, ఎవరికైనా రాసి ఇవ్వడం లాంటిది చేయడం ప్రమాదకరం. అంతేకాకుండా ఎవరికి ఆ పిన్ నెంబర్ ను షేర్ చేయవద్దు . ఒకవేళ ఎవరికైనా తప్పనిసరిగా షేర్ చేయాల్సి వస్తే ఆ తర్వాత వెంటనే మీ పిన్ నెంబర్ ను మార్చుకోండి.
యూపీఐ ఐడిని తనిఖీ చేయండి :
యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేసే ముందు యూపీఐ ఐడిని తప్పనిసరిగా చెక్ చేయండి. మీరు నెంబర్ ద్వారా చెల్లింపులు చేస్తున్నట్లయితే ఎంటర్ చేసిన తర్వాత కచ్చితంగా పేరును ఒకసారి తనిఖీ చేయండి.
యాప్ ను అప్డేట్ చేసుకోండి :
మీ యూపీఐ చెల్లింపుల యాప్ ఎల్లప్పుడు అప్డేట్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే మీరు చెల్లించే యాప్ లో ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తుంటాయి. అంతేకాకుండా యూపీఐ యాప్ ల కోసం అనేక భద్రత అప్డేట్లు కూడా విడుదల చేస్తాయి. అప్డేట్ చేసుకున్నప్పుడు మనకు యాప్ సరి కొత్తగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.
ALSO READ :
- Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
- మిర్యాలగూడ : మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!
- Viral Video : వామ్మో ఏం టాలెంట్ రా బాబు.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిదా..!
- Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)










